వేగంగా వెళ్తున్న లారీ.. బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
కర్నూలు : వేగంగా వెళ్తున్న లారీ.. బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాలలోని సంజీవనగర్లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంజీవనగర్కు చెందిన యోహాన్(40) మన్సిపాలిటి పరిధిలో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం బైక్‌పై సెంటర్‌కు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వాహనం పైనుంచి కిందపడిన యోహాన్ పై నుంచి లారీ రెండు టైర్లు పోవడంతో అతని దేహం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.