నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ మండలం కొండమల్లేపల్లి వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో సుమారు 20మంది గాయపడ్డారు.
నల్గొండ: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ మండలం కొండమల్లేపల్లి వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో సుమారు 20మంది గాయపడ్డారు. వారిలో 13మంది పరిస్థితి విషమంగా ఉంది. బత్తాయి కూలీలను తీసుకువెళుతున్న డీసీఎం వ్యాన్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొని బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో గాయపడినవారిలో ఎక్కువమంది పిల్లలే ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో తీవ్రంగా గాయపడినవారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తున్నారు. బాధితులంతా కేశతండాకు చెందినవారు. ప్రమాదం జరిగినప్పుడు డీసీఎంలో 20నుంచి 25మంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టరు: మధు