ఎస్సై రమేశ్(ఫైల్)
దేవరకొండ(నల్లగొండ జిల్లా): యలాల ఎస్సై రమేశ్ అంత్యక్రియల్లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తంది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రమేశ్ కుటుంబ సభ్యులు, బంధవులు పట్టుబట్టారు. రమేశ్ అనుమానాస్పద మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అంత్యక్రియలకు హాజరైన జిల్లా ఎస్పీని అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
రమేశ్ ను చంపి ఉరి తీశారని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఆరోపించారు. పోస్టుమార్టం నివేదిక అన్యాయంగా ఉందని అన్నారు. సీఎం సీరియస్ గా తీసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. రమేశ్ మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించకుంటే తెలంగాణ గిరిజనులతో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
కాగా, రమేశ్ కు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని అతడి మిత్రులు తెలిపారు. రమేశ్ మృతి వెనుక ఇసుక మాఫియా హస్తం ఉందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా యలాల ఎస్సైగా పనిచేస్తున్న రమేశ్ మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.