టేస్ట్ అదుర్స్!
వేసవి తాపం మొదలైంది.. బయటికెళ్లిన వారు దారిలో ఏదో ఒక పానీయం తాగి కడుపు చల్లబరుచుకోవాలనుకునే రోజులివి. అవీ ఇవీ ఎందుకు.. ఎంచక్కా పుదీనా జ్యూస్ తాగి కొత్త రుచి ఆహ్వానించండంటున్నారు పద్మావతి, వీరేష్ దంపతులు.
గుత్తికి చెందిన వీరు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో పుదీనా జ్యూస్ సెంటర్ నిర్వహించారు. వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది అనంతపురం వచ్చారు. ప్రభుత్వాస్పత్రి సమీపంలోని తెలుగుతల్లి సర్కిల్‌లో తోపుడు బండిపై మజ్జిగతో పాటు పుదీనా జ్యూస్ విక్రయిస్తూ నగరవాసులను ఆకట్టుకుంటున్నారు. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ పలువురు లొట్టలేసుకుంటూ తాగేస్తున్నారు.