padhamavavthi
-
భార్య, కుమారుడికి నిప్పంటించి.. భర్త ఆత్మహత్యాయత్నం
తాగిన మైకంలో ఘాతుకం చికిత్స పొందుతూ మృతి తాగిన మత్తులో ఓ వ్యక్తి.. కట్టుకున్న భార్య, కన్నకొడుకుపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం అతడూ ఆత్మహత్యకు యత్నించాడు. ముగ్గురూ మృతిచెందారు. మహారాష్ర్ట నాందేడ్ జిల్లా ముద్కేడ్ మండలం రాజదప్క గ్రామానికి చెందిన శరత్(30), పద్మావతి (25) దంపతులకు రెండేళ్ల కుమారుడు జయంత్ ఉన్నాడు. వీరు రెండు నెలల క్రితం నగరానికి వచ్చి మియాపూర్‌లోని సాయినగర్ కాలనీలో ఉంటున్నారు. పెయింటర్‌గా పనిచేస్తున్న శరత్.. ఈనెల 14న మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో పద్మ.. భర్తను మందలించింది. అనంతరం నిద్రపోయిన భార్య, కుమారుడిపై శరత్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తన ఒంటిపై కూడా కిరోసిన్ పోసుకుని అంటించుకున్నాడు. వారి కేకలు విన్న స్థానికులు వెంటనే వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన బాధితుల్ని 108 అంబులెన్స్ ద్వారా గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రీకొడుకులు ఆదివారం రాత్రి మృతిచెందగా, సోమవారం పద్మ ప్రాణాలు కోల్పోయింది. -
జగన్ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి
యల్లనూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి సాధ్యమని శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. మండలంలోని కొడవండ్లపల్లి, ఆరవేడు, బుక్కాపురం, నేర్జాంపల్లి గ్రామాల్లో శనివారం ఆమె గడపగడపకూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తమ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టే ప్రజాసంక్షేమ పథకాలను వివరించారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్ల పెంపు, అమ్మ ఒడి, రైతులకు వడ్డీలేని రుణాలు, వ్యవసాయ సూచనలు, వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్, పంటలకు మద్దతు ధర కోసం స్థిరీకరణ నిధి ఏర్పాటు, డ్వాక్రా రుణాల మాఫీ, తదితర పథకాలను విశదీకరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన పథకాలను కాంగ్రెస్ పాలకులు తుంగలో తొక్కారన్నారు. సంక్షేమ పథకాలు తిరిగి ప్రజలకు అందుబాటులోకి రావాలంటే జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాల్సి ఉందని, ఇందుకు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం.. ఆరవేడు, బుక్కాపురంలో నెలకొన్న తాగునీటి సమస్యలను ఆ గ్రామ మహిళలు పద్మావతి దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారానికి గతంలో హామీ ఇచ్చిన నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై పద్మావతి మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి రాగానే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. -
టేస్ట్ అదుర్స్!
వేసవి తాపం మొదలైంది.. బయటికెళ్లిన వారు దారిలో ఏదో ఒక పానీయం తాగి కడుపు చల్లబరుచుకోవాలనుకునే రోజులివి. అవీ ఇవీ ఎందుకు.. ఎంచక్కా పుదీనా జ్యూస్ తాగి కొత్త రుచి ఆహ్వానించండంటున్నారు పద్మావతి, వీరేష్ దంపతులు. గుత్తికి చెందిన వీరు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో పుదీనా జ్యూస్ సెంటర్ నిర్వహించారు. వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది అనంతపురం వచ్చారు. ప్రభుత్వాస్పత్రి సమీపంలోని తెలుగుతల్లి సర్కిల్లో తోపుడు బండిపై మజ్జిగతో పాటు పుదీనా జ్యూస్ విక్రయిస్తూ నగరవాసులను ఆకట్టుకుంటున్నారు. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ పలువురు లొట్టలేసుకుంటూ తాగేస్తున్నారు.