ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించాలి
► మహిళల పక్షపాతి సీఎం కేసీఆర్
► మంత్రి గుంటకండ్ల గర్భిణులకు సామూహిక శ్రీమంతం
సూర్యాపేట : ప్రభుత్వ వైద్యంపై దశాబ్ధాల నుంచి నెలకొన్న అనుమానాన్ని తొలగించి.. నమ్మకం కలిగించే ప్రక్రియలో ఎన్‌జీఓలు, ఎస్‌హెచ్‌జీ సంస్థలు కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 12వ వార్డు అంబేద్కర్‌నగర్ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. గుండె మార్పిడీ శస్త్రచికిత్స మనదేశంలో మొదటగా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేశారని గుర్తుచేశారు.
ఆధునిక పరికరాలు, నిపుణులు ప్రభుత్వ రంగంలోనే ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కంటి పరీక్ష చేయించుకున్నారు. అనంతరం గర్భిణులకు నిర్వహించిన సామూహిక శ్రీమంతంలో ఆయన పాల్గొని పూలు, పండ్లు అందజేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ మహిళల పక్షపాతి అని.. సృష్టికి మూలమైన స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్ తెలం గాణ సమాజం ఆదర్శంగా ఉంటుం దన్న.. సంకల్పంతో ప్రభుత్వాçస్పత్రుల్లో ప్రసవం చేసుకునే వారికి రూ.12 వేల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించారని అన్నారు. తల్లీబిడ్డకు మూడు నెలల పాటు ఉపయోగపడే 16 రకాల వస్తువులతో కూడిన సీఎం కేసీఆర్ కిట్‌ను అందించనున్నట్లు తెలి పారు.
కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ జిల్లాలోని 23 పీహెచ్‌సీ, రెండు ఏరియాస్పత్రులు, ఒక కమ్యూనిటీ ఆస్పత్రిని ఏడాదిలో ఆధునికీకరించనున్నట్లు తెలిపారు. రాజీవ్‌నగర్, గిరినగర్, అంబేద్కర్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లను ఆధునికీకరించేందుకు మం త్రి తన నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా రక్తాన్ని సరఫరా చేసేందుకు ముం దుకు వచ్చిన రెండ్‌క్రాస్ సొసైటీని అభినందించారు. వైద్యులు, రోగులకు సహకరించేందుకు వలంటీర్లను నియమిస్తున్న స్ఫూర్తిక్లబ్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిప ల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, ఏఎంసీ చైర్మన్ వైవి, డీఎంహెచ్‌ఓ తండు మురళీమోహన్, నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్ పాల్గొన్నారు.