సాక్షి, విజయవాడ: నగరంలోని కొత్తపేట రాజ సాహెబ్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆస్పత్రిని సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఆస్పత్రిని త్వరలోనే మినీ ప్రభుత్వ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని గతంలో హామీ ఇచ్చామనీ, అందుకు అనుగుణంగానే పట్టణ వన్-టౌన్ వాసుల చిరకాల వాంఛ నెరవేరబోతోందని అన్నారు. వైద్యవిధాన పరిషత్ అధికారులతో చర్చించి కొద్దిరోజుల్లోనే ఆస్పత్రి పనులు ప్రారంభిస్తామన్నారు. అంబులెన్స్, వాహనాలు రావడానికి అనువుగా మున్సిపల్ కమిషనర్‌తో చర్చలు జరిపి రహదారి వెడల్పు, అభివృద్ధి పనులు చేయిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment