అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిదిలోని రేకులకుంట గ్రామంలో వినాయక నిమజ్జనంలో శనివారం అపశ్రుతి చోటు చేసుకుంది.
బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిదిలోని రేకులకుంట గ్రామంలో వినాయక నిమజ్జనంలో శనివారం అపశ్రుతి చోటు చేసుకుంది. మండలంలోని రేకులకుంట గ్రామానికి చెందిన సాయికుమార్(18) పట్టణంలోని ఓ సెల్ పాయింట్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం గ్రామంలో వినాయక నిమజ్జనం జరుగుతుండగా.. అందులో పాల్గొన్న సాయికుమార్ ప్రమాదవశాత్తూ.. నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్ కింద పడ్డాడు. దీంతో ట్రాక్టర్ కాళ్లపై నుంచి వెళ్లడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. ఇది గమనించిన స్థానికులు అతన్ని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.