చల్లపల్లి ప్రభుత్వాసుపత్రి ఎదుట మంగళాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాలు..చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలో నాగేశ్వరరావు(35) అనే వ్యక్తిని సోమవారం రాత్రి పాము కాటేసింది. కుటుంబసభ్యులు నాగేశ్వరరావును చికిత్సనిమిత్తం చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కాసింత ఆలస్యం చేసి బందరుకు రిఫర్ చేశారు. బందరులో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే నాగేశ్వరరావు మృతిచెందాడని, వెంటనే అతడిని సస్పెండ్ చేయాలని మంగళాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
చల్లపల్లి ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళన
Published Tue, Jul 5 2016 5:57 PM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM
Advertisement
Advertisement