శ్రీకాకుళం(రేగిడి): మండలంలోని లింగాలవలస గ్రామంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి తాను ఆత్మహత్యానికి పాల్పడింది. ఈ ఘటనలో తల్లి రాణి(30), కూమార్తెలు నిఖిత(8), రేష్మ(6)లు మృతిచెందారు. కుటుంబకలహాలతోటే రాణి ఈ పనికి పాల్పడినట్లు స్ధానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.