సాక్షి, విజయవాడ : నగరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రి వచ్చిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వైద్యులు నిర్లక్ష్యంగా చికిత్స అందించడంతో.. వైద్యం వికటించి చిన్నారులు ప్రాణాలు కోల్పోయరని చిన్నారుల బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ముందు బైఠాయించి.. వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మృతిచెందిన చిన్నారుల్లో ఒకరిది జీకొండూరు కాగా, మరొక చిన్నారిది విజయవాడ. గత నాలుగు రోజులుగా అస్వస్థతతో ఉండటంతో చిన్నారులను ఆస్పత్రికి తీసుకొచ్చామని, వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం అందించడంతో పిల్లలు ప్రాణాలు కోల్పోయారని వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు.
మరోవైపు ఆస్పత్రి వైద్యులు మాత్రం.. ఇద్దరు పిల్లలు అనారోగ్యంతోనే చనిపోయారని అంటున్నారు. పిల్లలకు అనారోగ్యంగా ఉన్న సంగతి ముందుగానే వారి తల్లిదండ్రులకు తెలియజేశామని, ఈ ఘటనలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం లేదని చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment