విజయనగరం పట్టణంలోని గోస ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ లేక గర్భిణులు, శిశువులు తీవ్ర అవస్థులు ఎదుర్కొన్నారు. మంగళవారం 13 గంటల పాటు జిల్లా కేంద్రంలో పవర్ కట్ ఉండగా, బుధవారం మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖలో 400కేవీ పవర్‌గ్రిడ్ ట్రిప్ అవడంతో ఈ పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఆస్పత్రిలో జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో ఉక్కపోతకు రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
కరెంటు లేక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల అవస్థలు
Published Wed, Apr 27 2016 6:43 PM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM
Advertisement
Advertisement