
సాక్షి, నిజామాబాద్: కొన్ని రోజులుగా తమకు పేషెంట్లు దొరకడం లేదనే కారణంతో గిరాకీ కోసం ముగ్గురు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు దుర్మార్గానికి ఒడిగట్టారు. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది గమనించడంతో పెను ప్రమాదమే తప్పింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులకు సంబంధించి ఆక్సిజన్ సరఫరాను ముగ్గురు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు నిలిపేశారు. ఆక్సిజన్ సరఫరా ఆగి పోవడాన్ని వార్డు బాయ్ గమనించారు, ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్‌ను ప్రభుత్వాసుపత్రి సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు డ్రైవర్ల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.
చదవండి: ఇంట్లో మంటలు: మహిళ సజీవదహనం
Hyderabad: ‘చేపలు అయిపోయాయి.. తప్పక చికెన్ తీసుకున్నా’
Comments
Please login to add a commentAdd a comment