9నెలల చిన్నారిపై లైంగికదాడికి యత్నం | Sexual assault | Sakshi
Sakshi News home page

9నెలల చిన్నారిపై లైంగికదాడికి యత్నం

Published Thu, Feb 25 2016 5:01 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

9నెలల చిన్నారిపై లైంగికదాడికి యత్నం - Sakshi

9నెలల చిన్నారిపై లైంగికదాడికి యత్నం

నిర్భయ చట్టం కింద కేసు నమోదు
రిమాండ్‌కు నిందితుడి తరలింపు

  
వెల్దండ : కామంతో ఉన్న అతడికి కన్నుమిన్ను కానరాలేదు. తొమ్మిది నెలల చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. ఈ ఘటన  వెల్దండలో బుధవారం వెలుగులోకి వచ్చింది. నింది తుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కల్వకుర్తి సీఐ వెంకట్, ఎస్‌ఐ జానకీరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  మంగళవారం తన తొమ్మిది నెలల చిన్నారికి తల్లి స్నానం చేయించి ఉయ్యాలలో పడుకోబెట్టింది. అనంతరం అరుబయట దుస్తులు ఉతికేందుకు వెళ్లింది. అంతకుముందు పాప తండ్రి, బంధువు అయిన 26ఏళ్ల లక్ష్మణ్ (పాపకు వరుసకు మామ) ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అనంతరం తండ్రి పనిమీద బయటకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో లక్ష్మణ్ ఉయ్యాలలో ఉన్న పాపను బయటకు తీసి లైంగికదాడికి యత్నించాడు. పాపకు రక్తస్రావం కావడంతో గుడ్డతో తుడిచి పడుకోబెట్టి వెళ్లిపోయాడు. పాప ఏడుపును గమనించిన తల్లి ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తస్రావం కావడంతో వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించగా లైంగికదాడి యత్నానికి గురైనట్లు గుర్తించారు. దీంతో తల్లిదండ్రులకు లక్ష్మణ్‌పై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
 నిందితుడు..సైకోగా అనుమానం
నిందితుడు లక్ష్మణ్‌ది తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి గ్రామం. అతని అమ్మమ్మ గ్రామం వెల్దండ. ఆమెకు జ్వరం రావడంతో నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు. అయితే ఇతనికి..పాప తండ్రి బావ అవుతాడు. దీంతో రోజూ వీరి ఇంట్లోనే భోజనం చేస్తున్నాడు. లక్ష్మణ్‌కు పెళ్లి అయింది. ఇతని చేష్టలతో విసిగిపోయిన భార్య వదిలిపెట్టి పోయినట్లు బంధువులు తెలిపారు. సైకోగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 కల్వకుర్తి సీఐ విచారణ
కల్వకుర్తి సీఐ వెంకట్ బుధవారం సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలి త ల్లిదండ్రుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement