రాయచోటిటౌన్/చిన్నమండెం : బల్లి పడిన నీళ్లు తాగి ఏడు మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నమండెం మండలం మల్లూరు పంచాయతీ పాత వట్టెవాండ్లపల్లెకు చెందిన వేమల రాధ, రామక్రిష్టలతో పాటు వారి పిల్లలు భవ్యశ్రీ, యువరాజులు మరో ముగ్గురు సోమవారం ఇంటిలోని బానలో నీళ్లు తాగారు. పిల్లలు ముందుగా తాగారు. తరువాత పొలం వద్ద నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూడా అవే నీళ్లు తాగారు. అలాగే ఇంటిలోని మిగతా వారు కూడా ఒకరి తర్వాత ఒకరు ఈ నీళ్లే తాగారు. సుమారు గంట వ్యవధి తరువాత వీరిలో ముందుగా పిల్లలిద్దరికీ వాంతులు మొదలయ్యాయి.
తరువాత మరో గంట వ్యవధిలో పెద్దలకు కూడా వాంతులయ్యాయి. ఇలా వరుస క్రమంలో అందరికీ వాంతులు కావడంతో ఏమి జరిగిందో తెలుసుకొనే లోగా వాంతులు అయిన వారు బానలోని నీళ్లు తీసుకుని నోరు కడిగే ప్రయత్నం చేయగా నీళ్లలో నుంచి చనిపోయి ఉబ్బిన బల్లి చేతిలో పడింది. అప్పటికి కాని వారికి ఆ నీళ్లలో బల్లి పడిన విషయం తెలియలేదు. వెంటనే అందరూ రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
బల్లి పడిన నీళ్లు తాగి ఏడుగురికి అస్వస్థత
Published Wed, Sep 2 2015 4:16 AM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM
Advertisement
Advertisement