సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల (ఐసీయూ) ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వైద్య విద్యా డెరైక్టర్.. చైర్మన్‌గా ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. 45 రోజుల్లోగా మౌలిక సదుపాయాలు, సిబ్బంది తదితర పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.