ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)–2018కు హాజరయ్యే అభ్యర్థులు పూర్తిగా సన్నద్ధంకావాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లాలో 18 కేంద్రాల్లో బుధవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. కంప్యూటర్ బేస్‌డ్‌గా నిర్వహించే ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కొన్ని సూచనలు పాటించాలని సూచించారు.
♦ అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలి.
♦ హాల్ టిక్కెట్‌పై ఉన్న పరీక్ష కేంద్రం, తేదీ, సమయం, రిజిస్టర్ నంబరు సరిచూసుకోవాలి..
♦ అడ్మిట్ కార్డుపై ఉన్న పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ‘లాగిన్’ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కంప్యూటర్‌లో ఉన్న వివరాలు సరిచూడాలి. అన్నీ సరిగా ఉంటే ‘కన్‌ఫర్మ్’ అని, లేకుంటే ‘ఐ డెనీ’ అని క్లిక్ చేయాలి.
♦ కంప్యూటర్ బాగా పనిచేస్తుందని, వివరాలు అందుబాటులో ఉన్నాయని క్లిక్ చేయాలి.
♦ అనంతరం నేను ప్రారంభించుటకు సిద్ధంగా ఉన్నాను అని క్లిక్ చేయాలి.
♦ ఇచ్చిన నాలుగు జవాబుల నుంచి సరైన దాన్ని ఎన్నుకొని క్లిక్ చేయాలి.
♦ పరీక్ష రాస్తున్నప్పుడు మిగిలిన సమయం కంప్యూటర్‌లో పరిశీలించవచ్చు.
♦ జవాబు రాయని ప్రశ్నలు ఎరుపు, ప్రయత్నించని ప్రశ్నలు తెలుపు, ప్రయత్నించిన ప్రశ్నలు ఆకుపచ్చ, పునఃపరిశీలనకు గుర్తించిన ప్రశ్నలు, జవాబు ఇచ్చిన ప్రశ్నలు ఊదా రంగులలో కనిపిస్తాయి.
♦ ప్రశ్నకు జవాబు రాసిన అనంతరం ‘సేవ్’ తర్వాత ‘నెక్స్›్ట’ బటన్ నొక్కాలి.
♦ కుడివైపు సెక్స్‌న్ బటన్ నొక్కడం వల్ల జవాబు ఇచ్చిన, ఇవ్వని, పునఃపరిశీలన ప్రశ్నలు కనిపిస్తాయి.
♦ కంప్యూటర్‌లో ఇచ్చిన అక్షరాల సైజు కనిపించకపోతే వెంటనే ఇన్విజిలేటరు దృష్టికి తీసుకెళ్లాలి.
♦ పరీక్ష సమయం 2.30 గంటలు పూర్తి కాగానే ‘సబ్మిట్’ అని బటన్ యాక్టివేట్ చేయాలి.
♦ దృష్టి లోపం ఉన్నవారికి, అంగవికలాంగులకు అదనంగా 50 నిమిషాలు సమయం ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment