సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి మంగళవారం అధికారులకు పలు సూచనలు జారీచేశారు. పరీక్ష కేంద్రాల్లో అక్రమాలు, అవకతవకలు జరిగితే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, సి–సెంటర్ కస్టోడియన్‌లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
♦ పరీక్ష కేంద్రాలన్నీ నో మొబైల్ జోన్లుగా ప్రకటించిన నేపథ్యంలో పరీక్ష విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ మొబైల్ ఫోన్ ఇంట్లోనే ఉంచి రావాలి. లేదా సెంటర్‌లో పోలీస్ పికెట్ వద్ద అప్పగించాలి.
♦ఒకసారి పరీక్ష కేంద్రంలోకి వచ్చిన సిబ్బంది పరీక్ష ముగిసేవరకు బయటికి రాకూడదు. అటెండర్లు, ఇతర సహాయకులు కూడా టీ, శీతల పానీయాలు వంటి అవసరాలకు కూడా బయటకు రాకూడదు.
♦పరీక్ష విధులు లేని ఉపాధ్యాయులు పరీక్ష జరిగే సమయంలో ఆ పరిసరాల్లో ఉండకూడదు.
♦ పరీక్ష కేంద్రాలుగా ఉన్న కె.జి.బి.వి., రెసిడెన్షియల్ పాఠశాలల ఉపాధ్యాయులు పరీక్ష విధులు లేకపోతే ఆ సమయంలో పాఠశాలలో ఉండకూడదు.
♦ పరీక్ష కేంద్రంలో ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఉండకూడదు.
♦ ప్రశ్నపత్రాలు, వాటిపై వదంతులు వాట్సాప్ గ్రూప్‌లలోగానీ, సామాజిక మాధ్యమాల్లోగానీ ప్రచారం చేయకూడదు.
♦ చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షకు హాజరుకాని అభ్యర్థుల ప్రశ్నపత్రాలను, మిగిలిన ప్రశ్నపత్రాలను ఉదయం 10 గంటలలోపు అకౌంట్ రాసి సీల్ చేయాలి.
♦ ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి పరీక్షల చట్టం 25/97 ప్రకారం ఏడేళ్ల వరకు జైలుశిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు.
కట్టుదిట్టంగా టెన్త్ పరీక్షలు
Published Wed, Apr 5 2023 5:01 AM | Last Updated on Wed, Apr 5 2023 5:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment