మీ ఆధార్‌ కార్డు ఒరిజినలేనా? ఇలా చెక్‌ చేస్కోండి | Aadhar Card Original Or Not Check Full Details In Telugu | Sakshi
Sakshi News home page

Aadhaar Card: ఇలా చెక్‌ చేస్కుంటే సరిపోద్ది.. ఈ రూల్స్‌ తెలియకుండా ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా వేస్ట్‌!

Published Wed, Sep 1 2021 4:06 PM | Last Updated on Wed, Sep 1 2021 4:29 PM

Aadhar Card Original Or Not Check Full Details In Telugu - Sakshi

నకిలీ వ్యవహారాలు మామూలు జనాలకు పెద్ద ఇబ్బందులే తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీదానికి ముడిపడి ఉన్న ఆధార్‌ విషయంలోనూ ఫేక్‌ కుంభకోణాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఆధార్‌ తీసుకుంటున్నవాళ్లు, లేదంటే మధ్యవర్తి ద్వారా కార్డులు సంపాదించుకుంటున్న వాళ్లు.. తమ 12 డిజిట్‌ నెంబర్లను ఆధార్‌ నెంబర్‌గా ఫిక్స్‌ అయిపోయి అన్నిచోట్లా సమర్పిస్తుంటారు. అయితే ఈ విషయంలో యూఐడీఏఐ ప్రజల కోసం ఓ అలర్ట్‌ను జారీ చేసింది.
  

Aadhar Card Alert: ఆధార్‌ను ఎక్కడైనా సమర్పించే ముందు అసలేనా? నకిలీనా? ఒక్కసారి తనిఖీ చేస్కోమని చెప్తోంది. లేకుంటే ఇబ్బందులు తప్పవని చెబుతోంది. ఇందుకోసం resident.uidai.gov.in/verify లింక్‌కు వెళ్లాలి. ఆపై కార్డుపై ఉన్న 12 అంకెల డిజిట్‌ను ఎంటర్‌ చేయాలి. కింద ఉన్న సెక్యూరిటీ కోడ్‌ లేదంటే క్యాప్చాను క్లిక్‌​ చేసి వెరిఫై కొట్టాలి.  అప్పుడు ఆ ఆధార్‌ నెంబర్‌ ఒరిజినలేనా? అసలు ఉందా? అనే వివరాలు కనిపిస్తాయి.
 

చాలామంది ఆధార్‌ అప్‌డేట్స్‌, మార్పుల విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. కానీ, చిన్న చిన్న మార్పులు, సవరణల కోసం ఆన్‌లైన్‌లోనే వెసులుబాటు కల్పిస్తోంది యూఐడీఏఐ. ఇక అప్‌డేషన్‌, మొత్తంగా మార్పుల కోసం మాత్రం తప్పనిసరిగా ఎన్‌రోల్‌మెంట్‌ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. 

 ఆధార్‌ కార్డ్‌పై  అడ్రస్‌ సవరణ కోసం ఆన్‌లైన్‌లో వెసులుబాటు కల్పించింది యూఐడీఏఐ
అడ్రస్‌ మార్పు కోసం ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ అంటే.. దగ్గర్లోని ఆధార్‌ సెంటర్‌ ఈ సౌకర్యం కల్పిస్తోంది. సవరించడం ఎలాగో తెలుసా?
► ఫొటో మార్చుకోవడానికి కూడా రీజియన్‌ సెంటర్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిమిషాల్లో ఫొటో మార్చుకోవచ్చు ఇలా

ఆధార్‌ కార్డు మీద పేరును రెండు సార్లు మార్చుకోవడానికి వీలుంటుంది. 
డేట్‌ ఆఫ్‌ బర్త్‌, జెండర్‌(ఆడ/మగ/ట్రాన్స్‌జెండర్‌) ఒక్కసారే మారతాయి. పుట్టినతేదీ మార్చుకోవాలా?
► జెండర్‌ మార్పునకు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. 
► మొబైల్‌ నెంబర్‌కు తప్పనిసరిగా లింక్‌ అయ్యి ఉండాలి. లేదంటే మార్పులేవీ జరగవు.

క్లిక్‌ చేయండి: ఇంట్లో నుండే ఆధార్ అప్‌డేట్ చేసుకోండి ఇలా!

ఒకవేళ మొబైల్‌ నెంబర్‌ వేరే వాళ్లది ఉన్నా.. పాత నెంబర్‌ను మార్చుకోవాలనుకున్నా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. స్థానిక పోస్ట్ మ్యాన్ లేదా పోస్టు మాస్టర్ కు ఫోన్ చేసి కోరితే ఇంటికే వచ్చి ఈ సేవలు అందిస్తారు. అయితే ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఇది అమలు అవుతుండడం విశేషం. గ్రామీణ ప్రాంతాల వాళ్లు మాత్రం మండల కేంద్రాలకు ‘క్యూ’ కట్టాల్సి వస్తోంది.
 
సెల్ఫ్‌  సర్వీస్‌ అప్‌డేట్‌ పోర్టల్‌ ద్వారా (SSUP) https://ssup.uidai.gov.in/ssup/ లింక్‌ క్లిక్‌ చేసి సంబంధిత స్కాన్‌ డాక్యుమెంట్లు సమర్పించి చిన్న చిన్న మార్పులు చేసుకునే వీలు మాత్రమే. సెల్ఫ్‌ సర్వీస్‌ పోర్టల్‌ ద్వారా యాభై రూపాయలు ఛార్జ్‌ చేస్తారు. 
ముఖ్యమైన విషయం ఏంటంటే.. పేరు, అడ్రస్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌, జెండర్‌, మొబైల్‌​నెంబర్‌, ఈ-మెయిల్‌, ఫింగర్‌ ఫ్రింట్స్‌, ఐరిస్‌, ఫొటోగ్రాఫ్‌.. ఇలాంటి వివరాల అప్‌డేషన్‌ కోసం పర్మినెంట్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్‌ను సంప్రదించాల్సిందే.
 ► సంబంధిత ఫామ్స్ అన్నీ యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోనే దొరుకుతాయి కూడా.

ఒకవేళ పొరపాటున పరిమితులు మించిపోతే ఎలా?.. ఆ టైంలో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ లేదంటే అప్‌డేట్‌ సెంటర్‌ను సంప్రదించడం ఉత్తమం.  అక్కడ తప్పిదానికి గల కారణాలు, వివరణలు, పొరపాట్ల సవరణకు సంబంధించిన వివరాలు, సరైన ప్రూవ్స్‌ సేకరిస్తారు( సంబంధిత ఫామ్స్‌ ద్వారా). ఆ వివరాలన్నింటిని హెల్ప్‌ డెస్క్‌కు పంపిస్తారు. అవసరం అయితే ఆఫీసులకు పిలుస్తారు. ఆపై వెరిఫికేషన్‌ ప్రాసెస్‌ మొదలవుతుంది. అవసరం అనుకుంటే అదనపు ఇన్వెస్టిగేషన్‌ జరుగుతుంది. అప్పుడు అప్‌డేట్‌ లేదంటే మార్పులకు జెన్యూన్‌ రీజన్‌ అని తెలిస్తేనే.. ఆ రిక్వెస్ట్‌ను టెక్‌ సెంటర్‌కు ప్రాసెసింగ్‌/రీప్రాసెసింగ్‌ పంపిస్తారు. ఈ ప్రాసెస్‌ సాగడానికి కచ్చితంగా ఎన్నిరోజులు పడుతుందనేది చెప్పలేం. ఒక్కోసారి ప్రాసెస్‌ మధ్యలోనే ఆగిపోయినా ఆగిపోవచ్చు!.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement