సురేష్, రమేష్ ఇద్దరు స్నేహితులు. ఆదివారం సెలవు రోజు కావడంతో తమకు నచ్చిన బిర్యానీని ఆరగించేందుకు సరదాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నారు. అలా వెళుతున్న ఆ ఇద్దరికి సడెన్‌గా రోడ్డు పక్కనే తాటికాయంత అక్షరాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆకర్షించింది. రెండు పార్శిళ్లు బిర్యానీ ఆర్డర్ ఇవ్వండి. ఒక బిర్యానీ పార్శిల్‌కే బిల్ కట్టండి' అంటూ ఫ్లెక్సీలోని ప్రకటన సారాంశం. అంతే డిస్కౌంట్‌లో బిర్యానీ వస్తుందని ఏమాత్రం ఆలోచించకుండా బిర్యానీ ఆర్డర్ చేశారు. సీన్ కట్ చేస్తే.. పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు.
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం..మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నరేగాన్ (Naregaon) అనే ప్రాంతంలో థామస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే థామస్ కు స్థానికంగా ప్రాచుర్యం పొందిన ఓ రెస్టారెంట్ యాజమాన్యం వెజ్, నాన్ వెజ్‌లో బిర్యానీతో పాటు పలు వంటకాలపై డిస్కౌంట్‌లు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో తెలుసుకున్నాడు. అంతే బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. అలా ఆర్డర్ ఇచ్చాడో లేదో అకౌంట్‌లో ఉన్న రూ.89,000 మాయమయ్యాయి.
దీంతో థామస్ కంగారు పడుతూ ఎంఐడీసీ(Maharashtra Industrial Development Corporation) స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), ఐటీ యాక్ట్ పరిధిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ అధికారులు మాట్లాడుతూ..బాధితుడు తన వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడని, అనంతరం ఆ అకౌంట్‌లో ఉన్న డబ్బులు మాయమైనట్లు తెలిపారు.
టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతుంది. మనిషి జీవన విధానాన్ని సమూలంగా మార్చేస్తుంది. అయితే ఈ టెక్నాలజీతో లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. లేదని ఏ మాత్రం అశ్రద్ధ వహించిన బ్యాంక్ అకౌంట‍్ల ఉన్న సొమ్ము క్షణాల్లో మాయం అవుతుందని హెచ్చరిస్తున్నారు. లేదని లైట్ తీసుకుంటే మోసపోతారని సూచిస్తున్నారు. సైబర్‌నేరాల్ని గుర్తించడం చాలా కష్టం. వెబ్‌సైట్/యాప్, బ్యాంక్/కార్డ్ డీటెయిల్స్ అడిగినప్పుడు, అది ఒరిజనల్‌లా లేదంటే ఫేకా అనే విషయాల్ని గుర్తించాలని అంటున్నారు. ముఖ్యంగా కొత్త వెబ్‌సైట్‌లు/యాప్‌లను ఉపయోగించే సమయంలో అలర్ట్‌గా ఉండాలని, సీవీవీ, కార్డ్ వివరాల్ని షేర్ చేయొద్దని సలహా ఇస్తున్నారు.
చదవండి: నా తమ్ముడి ఫోన్ పేలింది సార్..! ట్వీట్ చేసిన అన్న
Comments
Please login to add a commentAdd a comment