పుణె: ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన దానికి బదులుగా మరో వస్తువు వస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఆవేశంతో, అసహనంతో ఊగిపోతారు. కస్టమర్ కేర్‌కు కాల్ చేసి చెడామడా తిట్టేస్తారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం ఎగిరి గంతేస్తున్నాడు. ఎందుకో తెలిస్తే... మీరు షాకవుతారు. పుణెకు చెందిన గౌతమ్ రేజ్ అనే వ్యక్తి ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్‌లో స్కిన్ లోషన్ ఆర్డర్ చేశాడు. తీరా డెలివరీ అయ్యాక అందులో ఉన్న వస్తువును చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే అందులో రూ.19 వేలు విలువ చేసే బోస్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఉంది. దీంతో అతను కస్టమర్ కేర్‌కు కాల్ చేసి అసలు విషయం చెప్పాడు. అయితే అది నాన్ రిటర్నబుల్ ఆర్డర్ అయినందున వెనక్కు తీసుకోలేమని చెప్పారు. అంతేకాదు.. స్కిన్ లోషన్‌ను ఇవ్వనందున దాని డబ్బును కూడా తిరిగి చెల్లించేశారు. (అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు)
దీంతో అతను ఇది నిజమా కళా అని నమ్మలేకపోయాడు. వెంటనే ట్విటర్‌లో తనకు జరిగిన అద్భుత అనుభవాన్ని రాసుకొచ్చాడు. "నేను రూ.300 విలువైన స్కిన్ లోషన్ ఆర్డర్ చేస్తే దానికి బదులు రూ.19 వేలు ఖరీదు చేసే బోస్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వచ్చాయి. కస్టమర్ కేర్‌ను సంప్రదిస్తే వీటిని నా దగ్గరే ఉంచుకోమన్నారు" అని తన సంతోషాన్ని పంచుకున్నాడు. దీనితోపాటు ఓ సర్ఫ్ ప్యాకెట్ వచ్చిందని తెలిపాడు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు "కాస్త ఆ స్కిన్ లోషన్ పేరు చెప్తారా? వీలైతే లింక్ సెండ్ చేయండి" అంటూ అతడి వెంట పడుతున్నారు. "హేయ్, నాకు ఇయర్‌బడ్స్‌కు బదులు లోషన్ వచ్చింది.. మనిద్దరం వస్తువులు మార్చుకుందామా?" అంటూ చమత్కరించారు. మరొకరు మాత్రం "ఇయర్‌బడ్స్ ఆర్డర్ చేసిన వ్యక్తికి ఏం వచ్చుంటుందో, ఏమో?"నని విచారం వ్యక్తం చేశాడు. (ఆహా ఆన్‌లైన్ భోజనం..)
Comments
Please login to add a commentAdd a comment