
డెలివరీ అయిన భగవద్గీత
కోల్‌కతా : ఆన్‌లైన్ స్టోర్‌లలో ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా మరో వస్తువు వచ్చిన ఘటనలు కోకొల్లలు. ఫోన్ ఆర్డర్ చేస్తే ట్రిమ్మర్, స్కిన్ లోషన్ ఆర్డర్ చేస్తే ఖరీదైన ఇయర్ బర్డ్స్ ఇలా ఎన్నో వస్తువులు. కొన్ని కోపం, చిరాకు తెప్పిస్తే మరొకొన్ని నవ్వు తెప్పిస్తాయి. తాజాగా నవ్వు తెప్పించే సంఘటనే ఒకటి పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది. కోల్‌కతాకు చెందిన సుతీర్థ దాస్ బుధవారం ఆన్‌లైన్ స్టోర్ అమెజాన్‌లో కమ్యూనిస్టు మేనిఫెస్టో ఆర్డర్ చేశాడు. ఆర్డర్ కన్ఫర్మేషన్, డెలివరీ రోజు అతడికి మెసెజ్ రూపంలో అందాయి. శనివారం 11గంటల సమయంలో అతడికి ఓ మహిళనుంచి ఫోన్ వచ్చింది.(హుర్రే: ఆర్డర్ చేసిందొకటి.. వచ్చింది మరొకటి)
కమ్యూనిస్టు బుక్ కాకుండా వేరే బుక్ డెలివరీ అవ్వబోతోందని, డెలివరీ క్యాన్సిల్ చేయాలని ఆమె సుతీర్థకు చెప్పింది. అతడు ఆఫీసులో ఉన్న కారణంగా బుకింగ్ క్యాన్సిల్ చేయలేకపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పార్శిల్ విప్పి చూసి ఆశ్చర్యపోయాడు. దాని కవర్ మీద కమ్యూనిస్టు మేనిఫెస్టో అని రాసి ఉన్నా.. లోపల మాత్రం భగవద్గీత ఉంది. అతడు తన ఆన్‌లైన్ ఆర్డర్ అనుభవాలను ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ న్యూస్ కాస్తా వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment