
బనశంకరి: నగరంలో ఆన్‌లైన్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆన్‌లైన్ లో బుక్ చేసిన ఆర్డర్లను రద్దు చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో రూ. లక్షలు పోగొట్టుకున్న ఘటన ఉద్యాన నగరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని అశోకనగర్‌కు చెందిన వెంకటేశ్ ఓ ఆన్‌లైన్ ద్వారా రూ. 1564 విలువైన బ్లూటూత్ హెడ్‌ఫోన్ ఆర్డర్ చేశాడు. అయితే వెంటనే ఆర్డర్ క్యాన్సిల్ యత్నించాడు. ఈ సమయంలోనే వంచకులు రంగంలోకి దిగారు.
కస్టమర్ కేర్ సపోర్టింగ్ అప్లికేషన్ డౌన్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. అనంతరం ఆన్‌లైన్ వ్యాలెట్ అప్లికేషన్ భర్తీ చేయాలని అడిగారు. కొన్ని క్షణాల్లోనే రెండు ఖాతాల నుంచి రూ. 5 లక్షల 57 వేల నగదు మరో ఖాతాలోకి బదిలీ అయ్యిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పది రోజుల తరువాత మరోసారి నగదు బదిలీ కావడంతో అశోకన్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రౌజర్ నుంచి ఫోన్ నెంబరు తీసుకుని ఆన్‌లైన్ షాపింగ్ చేసే ప్రజలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసిన నెంబర్లు మాత్రమే సంప్రదించాలి లేని పక్షంలో వారు సైబర్ వంచకులు ముఠా చేతికి చిక్కే అవకాశం ఉందని పోలీస్ అధికారి తెలిపారు.
(అల్లుని కుటుంబంపై కత్తులతో దాడి)
Comments
Please login to add a commentAdd a comment