హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు సంప్రదాయంలో పూజలు, వ్రతాలు, నోములు ఓ భాగం. ప్రతి పూజకూ ఒక్కో విధానం, ఒక్కో విశిష్టత ఉంది. మరి, ఏ పూజకు ఎలాంటి పూజసామగ్రిని వినియోగించాలనే దాని మీద కొంత అవగాహన ఉండట్లేదు. దీనికి పరిష్కారం చూపిస్తోంది ఈపూజస్టోర్.ఇన్. ఆన్‌లైన్‌లో పూజసామగ్రి సేవలందించడం దీని ప్రత్యేకత.
♦ కామేశ్వరీ ఈ సర్వీసెస్ ప్రై.లి. సీఈఓ కొడు కుల సోమేశ్వర రావు 2014లో రూ.25 లక్షల పెట్టుబడితో ఈపూజస్టోర్.ఇన్‌ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సేవలందిస్తుంది. దేవుళ్ల ప్రతిమలు, యంత్రాలు, రుద్రాక్షలు, ఆవు నెయ్యి, అష్టమూలికా తైలం, రాగి, పంచలోహ పూజా సామగ్రి, పంచలు, కండువలు, చీరలు, జాకెట్లు వంటివి పూజస్టోర్‌లో లభిస్తాయి. 50 రకాల పూజలకు సంబంధించిన సామగ్రి పూజస్టోర్‌లో ఉంది. వీటితో పాటూ పూజారులను కూడా బుకింగ్ చేసుకోవచ్చు. భవానీ, శివ, వెంకటేశ్వర, హనుమాన్, అయ్యప్ప మాలాధారులకు అవసరమైన పూజసామగ్రి, బట్టలు ఇతరత్రా ఉత్పత్తులు లభిస్తాయి.
♦ శ్రావణ, కార్తీక మాస పూజలు, వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగల పూజా సామగ్రితో పాటూ వ్యాపార సంస్థలు, గృహ ప్రవేశాలు, టీవీ సీరియల్స్, సినిమా ప్రారంభోత్సవాలకు అవసరమైన పూజా ద్రవ్యాలను, పూజారులను అందిస్తాం. హైదరాబాద్‌తో పాటూ అమెరికా, జపాన్‌లో జరిగిన హోమ గుండ యాగానికి పూజస్టోర్ నుంచే సామగ్రి అందించాం. శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వర ప్రసాద్ సూచించిన అన్ని రకాల దైవిక వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు.
♦ ఆయా పూజ ఉత్పత్తుల కోసం తయారీ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ఆర్డర్ వచ్చిన 3–5 రోజుల్లో సామగ్రి డెలివరీ చేస్తాం. బ్లూడార్ట్, డీహెచ్‌ఎఫ్‌ఎల్ కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం 8 మంది ఉద్యోగులున్నారు. గతేడాది రూ.2 కోట్ల టర్నోవర్‌ను సాధించాం. ఈ ఏడాది రూ.4 కోట్లు లకి‡్ష్యంచాం.
ఇంటి వద్దకే పూజా సామగ్రి!
Published Sat, Feb 17 2018 2:02 AM | Last Updated on Sat, Feb 17 2018 2:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment