bhagavath mann
-
గుర్బానీ ప్రసారాలు ఉచితం
చండీగఢ్: సిక్కులు పఠించే పవిత్ర శ్లోకం గుర్బానీ ఇకపై ఉచితంగా ప్రఖ్యాత స్వర్ణదేవాలయం నుంచి ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన బ్రిటిష్‌కాలంనాటి చట్టానికి చేసిన సవరణ ప్రతిపాదనలకు పంజాబ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. మంగళవారం శాసనసభలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం ప్రకటించారు. ఇన్నాళ్లూ గుర్బానీని రాష్ట్రంలో శక్తివంతమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన ప్రైవేట్ చానెల్ పీటీసీ ప్రసారం చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్జీపీసీ) మండిపడింది. ‘ఆ చట్టాన్ని పార్లమెంట్ చేసింది. దీనికి సవరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. సిక్కుల మత సంబంధ వ్యవహారాలకు ఆప్ ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోంది’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘చట్ట పరిధిపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఇది రాష్ట్ర పరిధిలోనిది’ అని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ గుర్బానీ వినిపించేటపుడు అడ్వర్ట్టైజ్మెంట్లు ఉండకూడదనే ఉద్దేశంతో∙ప్రత్యక్షంగా ఉచితంగా ఆడియో, వీడియో ప్రసారాలు చేస్తున్నాం’ అని ప్రభుత్వం ప్రకటించింది. పీటీసీ ప్రైవేట్ చానెల్‌కు అధిపతి అయిన శిరోమణి అకాళీదళ్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకే సర్కార్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. -
ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు
-
రూ. 1.5 కోట్ల డ్రీమ్ హౌస్... కూల్చడం ఇష్టం లేక ఇంటినే తరలిస్తున్న రైతు
రొడ్డు విస్తరణలో భాగంగా లేదా హైవే నిర్మించడం కోసం ప్రభుత్వం కొన్ని ఇళ్లను తొలగిస్తుంటుంది. ఇది సర్వ సాధారణం. అందుకు ప్రభుత్వం వారికి నష్ట పరిహారం కూడా ఇస్తుంది. ఐతే అచ్చం అలాంటి పరిస్థితే ఒక రైతుకు ఎదురైంది. కానీ ఆ రైతు అందుకు ససేమిరా అంటే ఏకంగా ఇంటినే తరలించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రైతు సుఖ్విందర్ సింగ్ తన డ్రీమ్ హౌస్‌ని కూల్చడం ఇష్టం లేక మొత్తం ఇంటినే తరిలించిందేకు సిద్ధమయ్యాడు. సంగ్రూర్ జిల్లాలోని రోషన్వాలా గ్రామంలో తన స్థలంలో నిర్మించుకున్న ఇల్లు ఉన్న ప్రదేశం ఎక్స్‌ప్రెస్ వే రోడ్డుని నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. భారత్‌మాల ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న ఈ రహదారిని ఢిల్లీ, అమృత్సర్ కత్రా ఎక్స్‌ప్రెస్ వే మార్గంలో నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎక్ప్రెస్ వే హర్యానా, పంజాబ్, జమ్ముకాశ్మీర్ మీదుగా వెళ్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సిఖ్విందర్ సింగ్ అనే రైతుకి తన ఇంటిని కూల్చివేసేందుకు నష్టపరిహారం కూడా చెల్లించింది. ఐతే సుఖ్‌విందర్‌కి తన ఇంటిని కూల్చడం ఇష్టం లేక మొత్తం ఇంటినే మరోక ప్రదేశానికి మార్చాలనుకున్నాడు. అంతేకాదు అతను భవన నిర్మాణ కార్మికుల సహకారంతో సుమారు 250 అడుగుల మేర ఉన్న ఇంటిని 500 అడుగులు దూరం కదిలించేందుకు పనులు కొనసాగిస్తున్నాడు. భవనాన్ని కదిపేందుకు చక్రాల వలే కనిపించే గేర్లను కూడా ఏర్పాటు చేశాడు. ఆ రైతు ఈ ఇంటిని నిర్మించడానికి దాదాపు రూ. 1.5 కోట్లు ఖర్చు అయ్యిందని, అదే సమయంలో ఇంటిని నిర్మించడానికి రెండేళ్లు పట్టిందని చెప్పుకొచ్చాడు. ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్‌ప్రెస్‌వే ప్రతిష్టాత్మకమైన జాతీయ రహదారి ప్రాజెక్టు అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. పైగా ఈ రహదారి వల్ల కాశ్మీర్‌కు ప్రయాణించే ప్రయాణికులకు సమయం, డబ్బు, శక్తి ఆదా అవుతుందని చెప్పారు. (చదవండి: చిచ్చు రేపిన తాగుడు అలవాటు... ఖతం చేసి సెల్ఫీ వీడియో!) -
పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం.. ఇంతలోనే వివాదంలో సీఎం భగవంత్ మాన్..!
ఛండీగఢ్ : ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజార్జీ సాధించి.. జాతీయ పార్టీలకు షాకిచ్చింది. ఈ క్రమంలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇంతలోనే ఆప్ ప్రభుత్వం ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ ఘటన పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, బుధవారం పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్.. ఖట్కర్ కలాన్ గ్రామంలో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం భగవంత్ మాన్.. సీఎం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. సీఎం భగవంత్ మాన్ సంతకం పెడుతున్న సందర్భంగా సీఎం వెనుకల గోడపై భగత్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోలు మాత్రమే కనిపించాయి. కాగా, సీఎం ఆఫీసులో షేర్ ఏ పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ ఫొటోను తొలగించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ పంజాబ్ ప్రధాన కార్యదర్శి సుభాష్ శర్మ మాట్లాడుతూ.. బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు పెట్టడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, మహారాజా రంజిత్ సింగ్ చిత్రాన్ని ఎందుకు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, అంతకు ముందు పంజాబ్‌కు సీఎంలుగా పనిచేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ సమయంలో ఆఫీసులో రంజిత్ సింగ్ ఫొటో ఉండటం విశేషం. -
‘చంద్రమండలంపై ఉద్యోగాలిస్తామంటారేమో’
చండీగఢ్: పంజాబ్ శిరోమణి అకాళీదల్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ విరుచుకుపడింది. ఆ పార్టీ మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దని ప్రజలను హెచ్చరించింది. తమకు మరోసారి అధికారం ఇస్తే అమెరికా, కెనడాల్లో ఉన్న పంజాబీలకు, అక్కడికి వెళ్లి స్థిరపడాలనుకునేవారికి అక్కడే పొలాలు కొని ఇస్తామంటూ ఉప ముఖ్యమంత్రి సుఖబీర్ సింగ్ బాదల్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం జలాలాబాద్‌లో నిర్వహించిన సభలో ఆప్ ప్రచారక కమిటీ చైర్మెన్ భగవత్ మాన్.. ‘సుఖబీర్ ఈసారి అమెరికా ప్రభుత్వ సహకారంతో నిరుద్యోగ యువతకు చంద్ర మండలంపై ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. తన అవినీతి సొమ్ముతో వలసదారుల పేరు మీద అమెరికా, కెనడాల్లో వ్యవసాయ భూములు ఆయన కొంటారు కూడా. ఇలాంటి అర్థంలేని హామీలను పంజాబ్ ప్రజలు నమ్మరు’ అన్నారు. పేదలు, ఎన్నారైల భూములు లాక్కున్నవారు (పంజాబ్ ప్రభుత్వం) తిరిగి వలసదారులకు సహాయం చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సుఖబీర్ గురించి తెలిసిన వారందరికీ ఆయన ప్రజలను మోసం చేస్తున్నారని అర్థమవుతుందన్నారు. బాదల్ కుటుంబం విదేశాల్లో పెద్ద మొత్తంలో భూములు కొన్నట్లు ఆయన ఆరోపించారు.