![Hero Aamir Khan Visited The Golden Temple - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/30/amir.jpg.webp?itok=Aiz3aQ-u)
ప్రముఖ బాలీవుడ్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమిర్ ఖాన్ శనివారం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించారు. లాల్‌సింగ్ చద్దా సినిమా షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం పంజాబ్‌లో ఉన్న ఈ సూపర్‌స్టార్ హర్‌మందిర్ సాహిబ్ గురుద్వారాలో ప్రార్థనలు జరిపారు. సిక్కుల పవిత్ర మందిరంలో అడుగీడే ముందు.. వారి ఆచారం ప్రకారం తలకు వస్త్రాన్ని చుట్టుకున్నారు. ప్రస్తుతం అమిర్ లుక్‌కు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. లాల్‌సింగ్ చద్దా కోసం పంజాబీ సర్దార్‌గా ఆమిర్ ఖాన్ మారిపోయిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఫారెస్ట్ గంప్ సినిమాకు లాల్‌సింగ్ చద్దా హిందీ రీమేక్. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్ కథానాయిక.
Actor Aamir Khan offers prayers at Gurudwara Harmandir Sahib (Golden Temple) in Amritsar. He is in Punjab for shooting of his upcoming film #LalSinghChaddha pic.twitter.com/jyZMW6LzWQ
— ANI (@ANI) November 30, 2019
Comments
Please login to add a commentAdd a comment