గిన్నెలు కడిగిన రాహుల్ గాంధీ.. స్వర్ణ దేవాలయంలో పూజలు..  | Rahul Gandhi Visits Golden Temple Volunteer Service Sewa | Sakshi
Sakshi News home page

గిన్నెలు కడిగిన రాహుల్ గాంధీ.. స్వర్ణ దేవాలయంలో పూజలు..

Published Mon, Oct 2 2023 8:16 PM | Last Updated on Tue, Oct 3 2023 4:13 PM

Rahul Gandhi Visits Golden Temple Volunteer Serviceewa - Sakshi

అమృత్‌సర్‌: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వర్ణ దేవాలయంలో ప్రార్ధనలు నిర్వహించి అనంతరం 'కర సేవ'లో పాల్గొని భక్తులకు ప్రసాదాలు వడ్డించిన గిన్నెలను కడిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. 

రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన భారత్ జోడో యాత్ర సందర్బంగా గత కొంత కాలంగా జనంతో మమేకమవుతూ వస్తున్నారు. ఇటీవల రైల్వే కూలీగానూ, వడ్రంగిగానూ సామాన్యులతో సమయం గడిపిన ఆయన ఈ రోజు స్వర్ణదేవాలయంలో పనివాడిగా మారిపోయారు. ఈ రోజు ఉదయం 11.15 గంటలకు ప్రత్యేక విమానంలో పంజాబ్ వచ్చిన ఆయన అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయంలో  తలకు నీలిరంగు పాగాను ధరించి మొదట ప్రార్ధనలు నిర్వహించిన ఆయన అనంతరం 'కర సేవ'లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ భక్తులకు ప్రసాదాన్ని అందించే గిన్నెలను కడిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అయ్యింది. 

అంతకుముందు రాహుల్ గాంధీ పర్యటన గురించి అక్కడి కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా కార్యకర్తలకు సందేశమిచ్చారు. రాహుల్ గాంధీ సఖ్‌చంద్ శ్రీ హార్మిందర్ సాహిబ్‌ను స్మరించుకునేందుకు అమృత్‌సర్‌ వస్తున్నారు. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన. ఆయన ప్రైవసీని మనం గౌరవించాలి. కాబట్టి కార్యకర్తలు ఎవ్వరూ ఆయనను కలిసేందుకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన మళ్ళీ వచ్చినప్పుడు కలిసి మీ మద్దతు తెలపాలని కోరారు. 

ఇది కూడా చదవండి: వందే భారత్ రైలుకు తప్పిన పెనుప్రమాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement