
తమిళనాడు యాత్ర
పర్యాటకరంగానికి ఆయువుపట్టు. సహజ అందాలకు, ప్రకృతి రమణీయ తకు పుట్టినిల్లు. దేవాలయాలు కళాత్మక సౌరభాలు. గోపురాలు శిల్పకళా చాతుర్యానికి ప్రతిరూపాలు. భిన్న సంస్కతితో పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా ఆకట్టుకునే గొప్పతనం తమిళనాడు సొంతం. కన్యాకుమారి, కుంబకోణం, రామేశ్వరం, చిదంబరం, శ్రీరంగం, జంబుకేశ్వ రం, మీనాక్షి, స్వర్ణ దేవాలయం.. ఇలా ఆధ్యాత్మిక ప్రదేశాలెన్నో ఈ రాష్ట్రంలో ఉన్నాయి.
శ్రీపురం స్వర్ణదేవాలయం
ఇటీవలే నిర్మించిన స్వర్ణ దేవాలయం వేలూరుకు దగ్గర్లో మలైకుడి సమీప కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. చెన్నై నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్ టన్నుల సిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉంటుంది.
బృహదీశ్వర ఆలయం
అత్యంత ప్రాచీన హిందూ దేవాలయంగా ప్రఖ్యాతిగాంచినది తంజా వూరు బృహదీశ్వర ఆలయం. హిందువుల పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడినది
కుంబకోణంలో బ్రహ్మ దేవాలయం
కావేరి, అరసలర్ నదుల మధ్య ఏర్పడింది కుంభకోణం. ఈ నగరాన్ని ‘సిటీ అఫ్ టెంపుల్స్’ గా పిలుస్తుంటారు. ఇక్కడ 188 ఆలయాలున్నాయి. చుట్టుపక్కల మరో 100 టెంపుల్స్ వరకూ ఉంటాయి. కుమ్బెస్వర టెంపుల్, సారంగపాణి టెంపుల్, రామస్వామి టెంపుల్ లు ప్రసిద్ధి చెందినవి. ప్రతి సంవత్సరం ఈ టెంపుల్ టవున్‌లో ‘మహామాహం’ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు కుంబకోణంకు వస్తారు.
రామేశ్వరం
హిందువుల పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడింది రామేశ్వరం. రామేశ్వరాన్ని విష్ణుమూర్తి ఏడవ అవతారం భావిస్తారు. రావణాసురుడి చర నుండి సీతాదేవిని కాపాడే క్రమంలో శ్రీలంక వెళ్లడానికి ఇక్కడ నుంచే రాముడు వంతెనను నిర్మించాడట. అందువల్లే రామేశ్వరానికి ఆపేరు. ఈ ప్రాంతంలో సుమారు 64 తీర్దాలు ఉండగా వీటిలో 24 ప్రాముఖ్యత గలవని, ఈ నీటిలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
శ్రీసుబ్రహ్మన్యేశ్వర దేవాలయం
ఈ ఆలయం తిరుచెందూర్ తూతుకుడి జిల్లాలో ఉంది. ఇక్కడ అందమైన దేవాలయాలు, తిరుచెందూర్ మురుగన్ టెంపుల్, వల్లి గుహ, దత్తాత్రేయ గుహ కలవు.
కన్యాకుమారి
భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రా స్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగానూ విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం, చంద్రోదయాలను చూసి పులకించని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు.
తప్పక సందర్శించదగినవి
వివేకానంద రాక్, తిరువళ్లువర్ విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కుమారి ఆలయం ముఖ్యమైనవి. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. వివేకానంద రాక్‌కు సమీపంలోని తిరువళ్లువర్ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇది ఆసియాలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచినది. బాణాసురుడిని సంహరించిన అమ్మవారి ‘కుమరి ఆలయం’ చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. కాంచీపురం థౌజండ్ టెంపుల్స్ నగరంగా ప్రఖ్యాతిగాంచింది. తమిళనాడులో చారిత్రక హిందూ ఆలయం మీనాక్షి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మధురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది. రంగనాధుడు రంగనాయకి అమ్మవారితో కొలువైవున్న దివ్యక్షేత్రం శ్రీరంగం. ఇది వైష్ణవ దివ్యదేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. పంచభూత క్షేత్రాలలో రెండవది జంబుకేశ్వరం. జంబుకేశ్వరానికి తిమేవ కాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటి అర్థం ప్రకారం ఇక్కడ ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రము అని అర్థం. పూర్వం ఇక్కడ అధికంగా జంబువృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి చెందిన ఆరు ప్రఖ్యాత క్షేత్రాలలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని.
తమిళనాడులోని మరిన్ని దర్శనీయ ప్రదేశాలను, అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలను... తెలుగు వారి ఆత్మీయ ట్రావెల్స్ ఖV టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీరూ దర్శించవచ్చు ఫిబ్రవరి 2, మార్చి 8, ఏప్రిల్ 4, మే 5, జూన్ 5న ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీరు తమిళనాడు యాత్ర చేయవచ్చు. మరిన్ని వివరాలకు హైదరాబాద్, కూకట్‌పల్లి,ఆఒ్క ఆఫీస్ ఎదురుగా ఉన్న ఖV టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్‌లో సంప్రదించి కానీ, ఫోన్ చేసి కానీ వివరాలు తెలుసుకోవచ్చు.