సాక్షి,న్యూఢిల్లీ : జీఎస్‌టీ వసూళ్లపై దేవాలయాలు , ధార్మిక, మత సంస్థలకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. ఆయా సంస్థల నుంచి వసూలు జీఎస్‌టీ పన్నులను తిరిగి వాటికి రీఫండ్ చేయనుంది. ఉచితంగా భోజనం అందించే ఆలయాలు, ధార్మిక సంస్థలకు ఈ చెల్లింపులను చేయనుంది. ఈ మేరకు సేవ భోజ్ యోజన పథకాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. ఇందుకు వచ్చే రెండేళ్లలో రూ.350కోట్లను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా చర్య మూలంగా తిరుమల తిరుపతి దేవస్థానం, స్వర్ణ దేవాలయ బోర్డులు గరిష్టంగా లబ్ది పొందనున్నాయి.
ప్రజలకు ఉచిత భోజనం (లాంగర్) అందించే దాతృత్వ మత సంస్థల నుంచి ముడి ఆహార వస్తువుల కొనుగోలుపై వసూలు చేసిన సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (సీజీఎస్‌టీ) ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (ఐజిఎస్టీ) వాటాను తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, శిరోమణి అకాలీ దళ్ల ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1, 2017నుంచి జనవరి 31, 2018 వరకు ఈ మినహాయింపును వర్తింప చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment