సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పుడప్పుడే కరోనా వైరస్ తగ్గేలా లేకపోవడంతో భారత రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే సర్వీసులపై నిషేధాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ, ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. అయితే లాక్ డౌన్ సమయంలో తీసుకువచ్చిన 230 ప్రత్యేక రైళ్లను మాత్రం నడపనున్నట్లు స్పష్టం చేసింది.. రైళ్ల రాకపోకలపై గతంలో విధించిన నిషేధం ఆగస్టు 12తో పూర్తి కానున్న విషయం తెలిసిందే. ఇదిలా వుండగా దేశంలో ఇప్పటివరకు 22,15,074 కేసులు నమోదవగా 44,386 మంది మరణించారు.
కినోవా రైతులకు కిసాన్ రైళ్లు..
పంటను తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో రవాణా చేసేందుక వీలుగా కేంద్రం కిసాన్ రైలు సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని దేవ్లాలీ నుంచి బిహార్‌లోని దాణాపూర్ వరకు బయలు దేరిన తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ క్రమంలో అబోహర్ నుంచి బెంగుళూరు, కోల్‌కతాలకు కిసాన్ రెళ్లను నడిపి కినోవా రైతులకు చేయూతనందించాలని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ సోమవారం రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో కినోవా పంట లక్ష ఎకరాల్లో పండిస్తున్నారని లేఖలో తెలిపారు. (కిసాన్ రైలుతో రైతులకు ఎంతో మేలు)
వీటి ఉత్పత్తిని దక్షిణ, తూర్పు రాష్ట్రాలకు సరఫరా చేయడం వల్ల కినోవాకు విస్తృతమైన మార్కెట్ లభిస్తుందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌కు దీన్ని పెద్ద మొత్తంలోనే ఉత్పత్తి చేస్తున్నప్పటికీ బెంగళూరు, కోల్‌కతాలో దీనికి మంచి మార్కెట్ ఉందని ఆమె తెలిపారు. త్వరగా పాడైపోయే గుణం ఉన్న ఈ పండు ఉత్పత్తి చేసిన దాంట్లో కేవలం 35 నుంచి 40 శాతం మాత్రమే వినియోగదారునికి చేరుతుందని వెల్లడించారు. రవాణాకు ఎక్కువ సమయం పట్టడం, అధిక ఉష్ణోగ్రత వల్ల మిగిలి పండంతా పాడవుతుందని దాని వల్ల రైతులు నష్టపోతున్నారని ఆమె పేర్కొన్నారు. కిసాన్ రైళ్లను కినోవా రైతులకు కేటాయిస్తే వారు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ తెలిపారు. (రైల్వే శాఖ కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment