Indian Railway Department
-
ఇకపై ట్రైన్ లో పేదవాడు ప్రవేశించలేని పరిస్థితి
-
రైలు ప్రయాణికులకు శుభవార్త
రైలు ప్రయాణంలో తమకు కావాల్సిన ఫుడ్ విషయంలో చాలా మంది అసంతృప్తి చెందుతుంటారు. ప్రాంతాలు మారుతున్న క్రమంలో సరైన ఆహారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాగా, ఇలాంటి విషయాలపై భారత రైల్వే బోర్డు.. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైళ్లలో ప్రయాణికులకు స్థానిక ఆహార పదార్థాలు అందించేలా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ)కి రైల్వే బోర్డు అనుమతి మంజూరు చేసింది. ఇందులో భాగంగానే.. రైళ్లలో ప్రయాణికులకు ఇకపై స్థానిక, ప్రాంతీయ ఆహారం కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకు, చిన్నారులకు, ఆరోగ్యపరంగా ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి తగిన ఆహారం అందజేయాలని సూచించింది. తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. రైళ్లలో కేటరింగ్ సేవలను మరింత మెరుగుపర్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేబోర్డు తెలియజేసింది. అలాగే.. శిశువులు, ఫుడ్ విషయాల్లో కేర్ తీసుకునే వారి కోసం ప్రత్యేక ఆహారాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు మెనూలో మార్పులు చేయాలని ఐఆర్సీటీసీకి రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాగా, రైళ్లలో ప్రయాణించే వారికి ప్రాంతీయ వంటకాలను అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. కాగా, పండుగల వేళల్లో సైతం ప్రత్యేక వంటకాలను సైతం విక్రయించుకోవచ్చని ఐఆర్సీటీసీకి బోర్డు తెలిపింది. శిశువులకు ఉపయోగపడే ఆహారంతో పాటు వివిధ వయస్సుల వారికి వారు మెచ్చే విధంగా ఫుడ్‌ను తయారు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ముందుగా నోటిఫై చేసిన ధరల ప్రకారమే ప్రీపెయిడ్ రైళ్లలో మెనూను ఐఆర్సీటీసీ నిర్ణయిస్తుందని రైల్వే బోర్డు వివరణ ఇచ్చింది. భోజనంలో కాకుండా.. ప్రత్యేకంగా ఆర్డర్ చేసే ఆహారాలు ఎంఆర్పీ ధరకు విక్రయించేందుకు అనుమితిస్తున్నట్టు తెలిపింది. ఎక్స్‌ప్రెస్, ఇతర రైళ్లలో మెనూలో ఉండే బడ్జెట్ ఆహార పదార్థాల ధరలను సైతం ఐఆర్సీటీసీ నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. In a major relief to diabetics, parents and health enthusiasts, Railway Board has allowed IRCTC to customise its menu to include local and regional cuisines as well as food suitable for diabetics, infants and health aficionados https://t.co/MF3kqiGJkE https://t.co/I6d5oS3yWo — Economic Times (@EconomicTimes) November 15, 2022 -
ప్రయాణికులకు అలర్ట్: నేటి నుంచి పలు రైళ్ల రద్దు
గుడివాడ టౌన్: ఉప్పులూరు–విజయవాడ రైల్వే డబ్లింగ్ పనులు చివరిదశకు చేరుకోవడంతో ఆ మార్గంలో ఫ్రీఎన్‌ఐ, మెయిన్ ఎన్ఐ పనులు జరుగుతున్న దృష్ట్యా ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేస్తున్నట్లు స్టేషన్ మే నేజర్ పొట్లూరి మోహన్‌గాంధీ శుక్రవారం తెలిపారు. ఈనెల 13, 14 తేదీల్లో మచిలీపట్నం–బీదర్, బీదర్–మచిలీపట్నం, నర్సాపూర్–ధర్మవరం, ధర్మవరం–నర్సాపూర్, 12, 13 తేదీల్లో కాకినాడ–లింగంపల్లి, లింగంపల్లి–కాకినాడ రైళ్లు రద్దు అవుతాయి. అదే తేదీల్లో సర్కార్ ఎక్స్‌ప్రెస్ తెనాలి వర కు, నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు విజయవాడ వరకు నడుస్తాయన్నారు. తిరుపతి–పూరి ఎక్స్‌ప్రెస్ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, శేషాద్రి ఎక్స్‌ప్రెస్, ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లు 13, 14 తేదీల్లో ఏలూరు, నిడదవోలు మీదుగా దారి మళ్లింపు జరుగుతుందని, మచిలీపట్నం–విజయవాడ, నర్సాపూర్–గుంటూరు పాసింజర్ రైళ్లు పూర్తిగా రద్దవుతాయని ఆయన తెలిపారు. -
గుడ్‌న్యూస్: 64 వేల బెడ్లతో రైల్వే శాఖ సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో వైద్య సేవలు, బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఆస్పత్రులు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ స్పందించి కరోనా బాధితులకు సేవ చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం రైల్వే సేవలు అంతంతమాత్రంగా ఉండడంతో ఖాళీగా ఉన్న రైళ్లను కరోనా చికిత్స కోసం వినియోగించనున్నారు. ఈ మేరకు రైళ్ల ద్వారా 64,000 బెడ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. 4 వేల కోచ్‌లను కరోనా చికిత్సకు కేటాయించింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశంలో కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఐసోలేషన్ బెడ్ల కోసం 4 వేల కరోనా కేర్ కోచ్‌లను రైల్వే శాఖ ఏర్పాటు చేసిందని, వాటిలో దాదాపు 64 వేల బెడ్లు రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుతం 169 కోచ్‌లు పలు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు. కరోనా అధికంగా ఉన్న రాష్ట్రాలకు ఆ రైల్వే కోచ్‌లను కేటాయించే అవకాశం ఉంది. ఈ రైల్వే కోచ్‌లకు సంబంధించిన వీడియోను కూడా మంత్రి పీయూశ్ గోయల్ ట్విటర్లో పంచుకున్నారు. చదవండి: ‘బరాత్’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్ చదవండి: 25 రోజుల్లో 23 లక్షల కరోనా టెస్టులు कोरोना संकट में Isolation Beds की आवश्यकता को देखते हुए भारतीय रेल ने देश भर में 4,000 COVID Care Coaches में 64,000 Beds तैयार किये हैं। 169 कोचेस के माध्यम से 2,700 से अधिक बेड्स राज्यों को हुए अब तक हुए उपलब्ध। 📒 https://t.co/R7UGlare84 pic.twitter.com/hFCxKckBHR — Piyush Goyal (@PiyushGoyal) April 27, 2021 -
రైల్వేకు కేటాయింపుల్లో భారీగా తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ ప్రభావం రైల్వేపై పడింది. గతేడాది కేంద్ర బడ్జెట్లో రైల్వేకు భారీగానే కేటాయింపులు జరిపిన కేంద్రం.. ఈసారి కొంత కోత పెట్టినట్టు కనిపిస్తోంది. రైల్వేకు సంబంధించిన కేటాయింపులను బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వెబ్సైట్లో ఉంచారు. గతేడాది కంటే దాదాపు రూ.2 వేల కోట్ల మేర కేటాయింపుల్లో కోత పడ్డట్టు కనిపిస్తోంది. ప్రాజెక్టుల వారీగా పరిశీలించినా.. కేటాయింపులు కొన్నింటికే పరిమితమయ్యాయి. కోవిడ్ వల్ల ఎదురైన ఆర్థిక ఆటంకాలతో కేటాయింపులు కుంచించుకుపోయాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సంవత్సరం పనులను వేగంగా నిర్వహించి రెండు, మూడు ప్రాజెక్టులు అందుబా టులోకి తేవాలని నిర్ణయించినా, వాటికి తగ్గ నిధులు మాత్రం దక్కలేదు. దేశవ్యాప్తంగా 56 ప్రాజెక్టులను ప్రాధాన్యమైనవిగా నిర్ధారించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు ప్రారంభించేలా చూడనున్నట్టు రైల్వే తాజాగా ప్రకటించింది. అందులో తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్, భద్రాచలం రోడ్–సత్తుపల్లి కొత్తలైన్లకు చోటు దక్కింది. కానీ ఈ రెండు ప్రాజెక్టులకు కూడా గత బడ్జెట్ కంటే నిధులు తక్కువే కేటాయించటం గమనార్హం. గత బడ్జెట్లో కొత్త లైన్లకు రూ.2,856 కోట్లు కేటాయిస్తే ఈసారి కేవలం రూ.205 కోట్లే దక్కాయి. డబ్లింగ్ పనులకు గతంతో పోలిస్తే రూ.3,836 కోట్లకు గాను కేవలం రూ.868 కోట్లే దక్కాయి. ఆ ఊసే లేదు.. రాష్ట్రప్రభుత్వం–రైల్వే మధ్య సమన్వయం కొరవడి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పనులు ముందుకు సాగని నేపథ్యంలో.. కొత్త బడ్జెట్లో దాని ఊసే లేదని తెలుస్తోంది. ఇప్పటికే రైల్వే శాఖ తన వాటాకు మించి నిధులు వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా బకాయిపడింది. ఆ నిధులు వస్తే పనులు జరుపుతామని ఇప్పటికే పలుమార్లు రైల్వే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. కానీ ఇప్పటివరకు నిధులు రాకపోవటంతో ఈసారి బడ్జెట్లో ఆ ప్రాజెక్టును విస్మరించినట్టు కనిపిస్తోంది. ఇక కాజీపేట వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాపు విషయంలోనూ అదే జరిగింది. దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపులు ఇలా.. పని తాజా బడ్జెట్ (అంకెలు రూ.కోట్లలో) గత బడ్జెట్ (అంకెలు రూ.కోట్లలో) కొత్త లైన్లకు 205 2,856 డబ్లింగ్ పనులకు 868.10 3,836 ట్రాఫిక్ వసతులకు 72.65 154 ఆర్ఓబీ/ఆర్యూబీల నిర్మాణం 562.86 584 ట్రాకుల పునరుద్ధరణ 862 900 ప్రయాణికుల వసతుల మెరుగుకు 199.49 672 ప్రధాన ప్రాజెక్టుల కేటాయింపులు ఇలా.. మునీరాబాద్–మహబూబ్‌నగర్ 149 240 మనోహరాబాద్–కొత్తపల్లి 325 235 భద్రాచలం రోడ్–సత్తుపల్లి 267 520 అక్కన్నపేట– మెదక్ 83.63 - డబ్లింగ్ పనులు కాజీపేట–విజయవాడ 300 404 కాజీపేట–బల్లార్షా 475 483 సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ 100 185 విజయవాడ–కాజీపేట బైపాస్ 286 - మంచిర్యాల–పెద్దంపేట ట్రిప్లింగ్ 4.50 - చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ 50 5 అంతా గందరగోళం.. రైల్వేకు సంబంధించి బడ్జెట్ పింక్ బుక్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టాక వివరాలు అందిస్తారు. బుధవారం రాత్రి 8 వరకు కూడా ఆ సమాచారం అందకపోయేసరికి, గురువారమే వివరాలు వస్తాయని మీడియాకు వెల్లడించి అధికారులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత రాత్రి 9 సమయంలో బడ్జెట్ వివరాలను ఢిల్లీ నుంచి వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. దీంతో వాటిని క్రోడీకరించే సమయం లేదని పేర్కొన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరాలను గురువారమే వెల్లడించగలమని తేల్చి చెప్పారు. -
కరోనా నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పుడప్పుడే కరోనా వైరస్ తగ్గేలా లేకపోవడంతో భారత రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే సర్వీసులపై నిషేధాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ, ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. అయితే లాక్ డౌన్ సమయంలో తీసుకువచ్చిన 230 ప్రత్యేక రైళ్లను మాత్రం నడపనున్నట్లు స్పష్టం చేసింది.. రైళ్ల రాకపోకలపై గతంలో విధించిన నిషేధం ఆగస్టు 12తో పూర్తి కానున్న విషయం తెలిసిందే. ఇదిలా వుండగా దేశంలో ఇప్పటివరకు 22,15,074 కేసులు నమోదవగా 44,386 మంది మరణించారు. కినోవా రైతులకు కిసాన్ రైళ్లు.. పంటను తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో రవాణా చేసేందుక వీలుగా కేంద్రం కిసాన్ రైలు సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని దేవ్లాలీ నుంచి బిహార్‌లోని దాణాపూర్ వరకు బయలు దేరిన తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ క్రమంలో అబోహర్ నుంచి బెంగుళూరు, కోల్‌కతాలకు కిసాన్ రెళ్లను నడిపి కినోవా రైతులకు చేయూతనందించాలని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ సోమవారం రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో కినోవా పంట లక్ష ఎకరాల్లో పండిస్తున్నారని లేఖలో తెలిపారు. (కిసాన్ రైలుతో రైతులకు ఎంతో మేలు) వీటి ఉత్పత్తిని దక్షిణ, తూర్పు రాష్ట్రాలకు సరఫరా చేయడం వల్ల కినోవాకు విస్తృతమైన మార్కెట్ లభిస్తుందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌కు దీన్ని పెద్ద మొత్తంలోనే ఉత్పత్తి చేస్తున్నప్పటికీ బెంగళూరు, కోల్‌కతాలో దీనికి మంచి మార్కెట్ ఉందని ఆమె తెలిపారు. త్వరగా పాడైపోయే గుణం ఉన్న ఈ పండు ఉత్పత్తి చేసిన దాంట్లో కేవలం 35 నుంచి 40 శాతం మాత్రమే వినియోగదారునికి చేరుతుందని వెల్లడించారు. రవాణాకు ఎక్కువ సమయం పట్టడం, అధిక ఉష్ణోగ్రత వల్ల మిగిలి పండంతా పాడవుతుందని దాని వల్ల రైతులు నష్టపోతున్నారని ఆమె పేర్కొన్నారు. కిసాన్ రైళ్లను కినోవా రైతులకు కేటాయిస్తే వారు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ తెలిపారు. (రైల్వే శాఖ కీలక నిర్ణయం) -
సమస్యల కూత!
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లలో కనీస సౌకర్యాలు కరువై ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుండగా.. దక్షిణ మధ్య రైల్వేకు రూ.కోట్లలో ఆదాయం సమకూరుతుంది. అయినప్పటికీ ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కల్పనలో మాత్రం రైల్వే అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒక స్టేషన్లో తాగునీటి ఇబ్బంది వేధిస్తుండగా.. మరో స్టేషన్లో సరిపడా బాత్రూంలు లేక, వెయిటింగ్స్ హాల్స్ వినియోగానికి రాక, లోలెవల్ ప్లాట్‌ఫాంలు అభివృద్ధి చెందక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ సమస్యలను సర్పంచ్‌లు, కార్యదర్శులు పట్టించుకుంటే.. పట్టణ, మున్సిపాలిటీ సమస్యలను కౌన్సిలర్లు, చైర్మన్లు, కమిషనర్లు పట్టించుకుంటారు.. అలాగే బస్టాండుల్లో ఉన్న సమస్యలను డీఎంలు, స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పట్టించుకుని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తుంటారు. కానీ రైల్వేస్టేషన్ల వైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు. దీంతో అక్కడి సమస్యలు బయటికి రావడంలేదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో నిర్వహణ ఉండటంతో తమకెందుకులేనని అందరూ అనునకోవడంతో ఏళ్లు గడిచినా రైల్వే స్టేషన్లలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచడంలేదు. దీంతో సమస్యలను వెలికితీయడానికి ‘సాక్షి’ బృందం స్టేషన్లను సందర్శించి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. స్టేషన్ మహబూబ్‌నగర్: దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలో రెండో పెద్ద స్టేషన్ మహబూబ్‌నగర్. జిల్లా పరిధిలోని స్టేషన్ల గుండా ప్రతి రోజు 7వేల నుంచి 8వేల మంది ప్రయాణం సాగిస్తుండగా..ప్రతి రోజు సుమారు రూ.7 నుంచి 9 లక్షల దాకా ఆదాయం వస్తుంది. అయితే, స్టేషన్ ఆవరణలో బాత్రూంలు లేక, స్టేషన్లో ఉన్న బాత్రూంలు సరిపడా లేక ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా స్టేషన్ ఆవరణలో నిర్మించిన రైల్వే కమ్యూనిటీ భవనం వృథాగా మారింది. స్టేషన్ ఆవరణలోని పార్కు కూడా అస్తవ్యస్తంగా ఉంది. స్టేషన్‌కు అతిసమీపంలోని మోతీనగర్‌వాసులు పట్టాలపై నుంచి పట్టణంలో రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్యూబీ నిర్మించాలని కాలనీవాసులు ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ఈ రైల్వే స్టేషన్ బీ–గ్రేడ్ హోదాలో ఉంది. ఏ–గ్రేడ్ కోసం ఎదురుచూస్తున్నా ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది. రైల్వేస్టేషన్‌కు ఏ–గ్రేడ్ హోదా లభిస్తే స్టేషన్లో మరెన్నో సౌకర్యాలు అందుతాయి. తాగునీటి ఎద్దడి తీవ్రం జడ్చర్ల టౌన్: జడ్చర్ల రైల్వేస్టేషన్ సమస్యలకు నిలయంగా మారింది. ప్రధానంగా స్టేషన్లో తాగునీటి సమస్య వేధిస్తుంది. ఉన్న రెండు బోర్లు వట్టిపోవటంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్యకు అవి చాలకుండా ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క చోట తాగునీటి కోసం నల్లాలద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. స్టేషన్ ప్రాంగణంలో పలుచోట్ల నల్లాలు ఏర్పాటు చేసినప్పటికి అవి నిరుపయోగంగానే మారాయి. అదేవిధంగా కోతులు ప్రయాణికులను ప్లాట్‌ఫాంపైకి రానీవ్వకుండా పరుగులు పెట్టిస్తున్నాయి. రైలు వచ్చి స్టేషన్లో నిలబడితే మొదటిప్లాట్‌ఫాం నుంచి టికెట్ కొనుగోలు చేసి రెండవ ప్లాట్‌ఫాంలో ఆగిన రైలు ఎక్కాలంటే ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. నీటి కొరత కారణంగా ఉన్న టాయిలెట్స్ మూసి ఉంచుతున్నారు. వృథాగా వెయిటింగ్ హాల్ దేవరకద్ర: దేవరకద్ర రైల్వే స్టేషన్‌ను ఇటీవల కొత్తగా నిర్మించారు. ఈ స్టేషన్లో కేవలం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే నిలుస్తాయి. ఈ స్టేషన్ నుంచి నెలకు రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఇటీవల ఇక్కడి నుంచి మునీరాబాద్ రైల్వే లైన్ వేరు పడడం వల్ల ఈ స్టేషన్‌ను జంక్షన్‌గా ప్రకటించారు. అయినా దానికి తగ్గట్లు సౌకర్యాలు మాత్రం కల్పించలేదు. స్టేషన్లో క్యాంటిన్ మూతపడగా, వెయిటింగ్ హాల్స్ నిరుపయోగంగా ఉంది. దీంతో ప్రయాణికులు చెట్ల కింద బెంబీలపై వేచి ఉండే పరిస్థితి ఉంది. తాగునీటి సౌకర్యం ఉన్న కులాయిలు సక్రమంగా పని చేయడం లేదు. నియోజకవర్గ కేంద్రం అయిన ఇక్కడ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపడం లేదు. దీని వల్ల ప్రయాణికులు జిల్లా కేంద్రం వెళ్లి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ప్లాట్‌ఫాం ఎత్తు పెంచక అవస్థలు మండలంలోని కౌకుంట్ల, కురుమూర్తి రైల్వేస్టేషన్లలోనూ ప్లాట్‌ఫాం ఎత్తు తక్కువగా ఉన్నందున వృద్ధులు, చిన్నారులు రైలు ఎక్కడానికి ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక రెండు స్టేషన్లలోను క్యాంటిన్ మూత పడడం వల్ల ప్రయాణికులకు కనీసం టీ కూడా దొరకని పరిస్థితి ఉంది. కురుమూర్తి రైల్వేస్టేషన్ చాలా పురాతనమైనది. ఈ స్టేషన్ నిర్వహణను రైల్వే శాఖ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించింది. హైలెవల్ ప్లాట్‌ఫాం లేక అవస్థలు అలంపూర్: జోగుళాంబ రైల్వేస్టేషన్లో ప్రధానంగా లోలెవల్ ప్లాట్ ఫాంతో ఇబ్బంది నెలకొంది. వృద్ధులు, మహిళలు, పిల్లలు రైళ్లు ఎక్కడానికి అవస్థలు పడుతున్నారు. హైలెవల్ ప్లాట్ ఫాం నిర్మిస్తే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు. అదేవిధంగా, ఈ స్టేషన్లో ఏపీ సంపర్క్, బెంగుళూరు–వెంకటాద్రి, చైన్నైఎగ్మోర్, యశ్వవంత్పూర్ వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపితే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు. కానరాని సీసీ కెమెరాలు బాలానగర్ (జడ్చర్ల): మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్లో తాగునీటి సమస్యతోపాటు ప్రయాణికులకు భద్రత కరువైంది. స్టేషన్లో ఒక్క సీసీ కెమెరా సైతం ఏర్పాటుచేయలేదు. నిత్యంవందల సంఖ్యలో ప్రయాణికులు స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, సాయంత్రం, రాత్రి వేళల్లో మందుబాబులు స్టేషన్ పరిసరాల్లో మద్యం సేవిస్తుండడం పరిపాటిగా మారడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉండగా, స్టేషన్లో కొళాయిలు ఉన్నా నీరు రావడంలేదు. ఏళ్ల నుంచి క్యాంటిన్ మూసే ఉంచారు. బాలానగర్ (జడ్చర్ల): మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్లో తాగునీటి సమస్యతోపాటు ప్రయాణికులకు భద్రత కరువైంది. స్టేషన్లో ఒక్క సీసీ కెమెరా సైతం ఏర్పాటుచేయలేదు. నిత్యంవందల సంఖ్యలో ప్రయాణికులు స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, సాయంత్రం, రాత్రి వేళల్లో మందుబాబులు స్టేషన్ పరిసరాల్లో మద్యం సేవిస్తుండడం పరిపాటిగా మారడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉండగా, స్టేషన్లో కొళాయిలు ఉన్నా నీరు రావడంలేదు. ఏళ్ల నుంచి క్యాంటిన్ మూసే ఉంచారు. మూడేళ్ల కిందటి వరకు స్టేషన్లో క్యాంటీన్ ఉండేది. ఆ తర్వాత తీసివేశారు. ప్రయాణికులు ఏమైనా తిందాం అన్నా, నీరు తాగుదామన్నా క్యాంటీన్ లేని పరిస్థితి. ఉన్న కొళాయిల్లో నీరు రాని పరిస్థితి నెలకొంది. – ఆంజనేయులు ప్రయాణికుడు దేవరకద్ర ఎండలోనే ఎదురుచూడాలి మదనాపురం (వనపర్తి): ఒకప్పుడు వర్తక వ్యాపారంతో ఎంతో ప్రఖ్యాతి చెందిన మదనాపురం(వనపర్తి రోడ్డు) రైల్వే స్టేషన్లో షెడ్లు లేక ప్రయాణికులు ఎండలో ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. స్టేషన్ నుంచి ఎక్కువగా తిరుపతి, హైదరాబాదు, హుబ్లీ, రాయచూర్, పూణె, ముంబాయి, బెంగుళూరు తదితర ప్రాంతాలకు నిత్యం ప్రయాణికులు వెళ్తుంటారు. అయితే, స్టేషన్లో ఇటీవల నిర్మించిన మరుగుదొడ్లు వాడుకలోకి తీసుకరాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండవ ప్లాట్‌ఫాం ఉన్నప్పటికీ ప్రయణికుల కోసం షెడ్డు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు ఎండలోనే నిల్చునే పరిస్థితి నెలకొంది. ప్లాట్‌ఫాం ఎత్తు పెంచాలి కౌకుంట్ల స్టేషన్లో ప్లాట్ఫారం ఎత్తు పెంచాలి. మాలాంటి వాళ్లు రైలు ఎక్కాలంటే ఇబ్బందులు పడుతున్నాం. పాత కాలంలో ఎత్తు తక్కువగా ఉన్న ప్లాట్ ఫారం ఏర్పాటుచేశారు. ప్రస్తుతం రైలు ఎంతో ఎత్తులో ఉంటుంది. మెట్లను ఎక్కే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. – లక్ష్యయ్య, ప్రయాణికుడు, కొత్తకోట -
పదితో ప్రభుత్వ ఉద్యోగాలివిగో..
ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి.. సుస్థిర కెరీర్ సొంతం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ సంవత్సరాల పాటు ఉన్నత విద్యను అభ్యసించే పరిస్థితులు అందరికీ ఉండకపోవచ్చు. అలాంటి వారు పదో తరగతి అర్హతతోనే కొలువులో చేరే వీలుంది. అది కూడా సర్కారీ నౌకరీ! ఆ ప్రభుత్వ ఉద్యోగాలేమిటో... వాటిని సాధించడమెలాగో తెలుసుకుందాం!! కేంద్ర ప్రభుత్వ కొలువులు ఇండియన్ రైల్వేస్‌లో పోస్టులు: ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ గ్రూప్-డి హోదాతో.. టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లోని ట్రాక్‌మన్, ఖలాసి, పాయింట్స్మన్, గేట్‌మన్, హెల్పర్.. వెబ్సైట్:www.rrbsecunderabad.nic.in రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్స్ వయసు: 18 నుంచి 25 నియామకం: ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష వెబ్సైట్: www.rpfonlinereg.in పోస్టల్ శాఖలో పోస్ట్‌మెన్, మెయిల్ గార్డ్ వయసు: 27 ఏళ్ల లోపు ఉండాలి. నియామకం: ఆయా రాష్ట్రాలను సర్కిళ్లుగా విభజించి సర్కిళ్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఆర్మీలో ఉద్యోగాలు పోస్టులు: సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్సమన్, నర్సింగ్ అసిస్టెంట్. వయసు: 16 నుంచి 21 ఏళ్లు ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్‌లలో ప్రతిభ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ ఎంపిక: ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షలో ప్రతిభ వెబ్సైట్: www.bsf.nic.in అభ్యర్థులు చూడాల్సిన వెబ్సైట్లు ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ వెబ్సైట్: www.itbpolice.nic.in వెబ్సైట్: www.cisf.gov.in సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వెబ్సైట్: www.crpf.nic.in మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ వెబ్సైట్: www.mes.gov.in రాష్ట్ర ప్రభుత్వంలో.. ఆర్టీసీ.. బస్ డ్రైవర్లు, కండక్టర్లు అర్హత: హెవీ వెహికిల్ డ్రైవింగ్ లెసైన్స్, నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎంపిక: ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ) పోస్టులకు కూడా టెన్త క్లాస్ ఉత్తీర్ణులు అర్హులే. రాష్ట్ర స్థాయిలో జువెనైల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సబ్ సర్వీస్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్, మ్యాట్రన్ పోస్ట్‌లను కూడా పదో తరగతి అర్హత ఆధారంగా భర్తీ చేస్తారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో సర్వీస్ కమిషన్ గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా నియామకం చేపడతారు.