Nearly 4K Covid Care Coaches With 64k Beds Ready For Use By States, Union Ministry Of Railways - Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌: 64 వేల బెడ్లతో రైల్వే శాఖ సిద్ధం

Published Tue, Apr 27 2021 6:58 PM | Last Updated on Tue, Apr 27 2021 7:33 PM

4K Covid Coaches, 64k Isolation Beds Arranged Indian Raiways - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణతో వైద్య సేవలు, బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఆస్పత్రులు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ స్పందించి కరోనా బాధితులకు సేవ చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం రైల్వే సేవలు అంతంతమాత్రంగా ఉండడంతో ఖాళీగా ఉన్న రైళ్లను కరోనా చికిత్స కోసం వినియోగించనున్నారు. ఈ మేరకు రైళ్ల ద్వారా 64,000 బెడ్లను రైల్వే శాఖ అందుబాటులోకి  తీసుకువచ్చింది. 4 వేల కోచ్‌లను కరోనా చికిత్సకు కేటాయించింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. 

దేశంలో కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఐసోలేషన్‌ బెడ్ల కోసం 4 వేల కరోనా కేర్‌ కోచ్‌లను రైల్వే శాఖ ఏర్పాటు చేసిందని, వాటిలో దాదాపు 64 వేల బెడ్లు రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌ ప్రకటించారు. ప్రస్తుతం 169 కోచ్‌లు పలు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు. కరోనా అధికంగా ఉన్న రాష్ట్రాలకు ఆ రైల్వే కోచ్‌లను కేటాయించే అవకాశం ఉంది. ఈ రైల్వే కోచ్‌లకు సంబంధించిన వీడియోను కూడా మంత్రి పీయూశ్‌ గోయల్‌ ట్విటర్‌లో పంచుకున్నారు.

చదవండి: ‘బరాత్‌’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌

చదవండి: 25 రోజుల్లో 23 లక్షల కరోనా టెస్టులు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement