
గుడివాడ టౌన్: ఉప్పులూరు–విజయవాడ రైల్వే డబ్లింగ్ పనులు చివరిదశకు చేరుకోవడంతో ఆ మార్గంలో ఫ్రీఎన్‌ఐ, మెయిన్ ఎన్‌ఐ పనులు జరుగుతున్న దృష్ట్యా ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేస్తున్నట్లు స్టేషన్ మే నేజర్ పొట్లూరి మోహన్‌గాంధీ శుక్రవారం తెలిపారు. ఈనెల 13, 14 తేదీల్లో మచిలీపట్నం–బీదర్, బీదర్–మచిలీపట్నం, నర్సాపూర్–ధర్మవరం, ధర్మవరం–నర్సాపూర్, 12, 13 తేదీల్లో కాకినాడ–లింగంపల్లి, లింగంపల్లి–కాకినాడ రైళ్లు రద్దు అవుతాయి.
అదే తేదీల్లో సర్కార్ ఎక్స్‌ప్రెస్ తెనాలి వర కు, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు విజయవాడ వరకు నడుస్తాయన్నారు. తిరుపతి–పూరి ఎక్స్‌ప్రెస్ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, శేషాద్రి ఎక్స్‌ప్రెస్, ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లు 13, 14 తేదీల్లో ఏలూరు, నిడదవోలు మీదుగా దారి మళ్లింపు జరుగుతుందని, మచిలీపట్నం–విజయవాడ, నర్సాపూర్–గుంటూరు పాసింజర్ రైళ్లు పూర్తిగా రద్దవుతాయని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment