Several trains cancelled
-
గులాబ్ తుపాన్ ప్రభావం: పలు రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: గులాబ్ తుపాను ప్రభావంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కొన్ని రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించింది. భువనేశ్వర్-సికింద్రాబాద్, భువనేశ్వర్- తిరుపతి, పూరీ-చెన్నై సెంట్రల్, సంబల్పూర్-హెచ్ఎస్ నాందేడ్, రాయగూడ-గుంటూరు, భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగుళూరు సిటీ, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లతో పాటు మరికొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. చదవండి: Cyclone Gulab: తీరం వెంబడి బలమైన గాలులు Cyclone Gulab: అప్రమత్తం.. 1358 మందికి పునరావాసం -
ప్రయాణికులకు అలర్ట్: నేటి నుంచి పలు రైళ్ల రద్దు
గుడివాడ టౌన్: ఉప్పులూరు–విజయవాడ రైల్వే డబ్లింగ్ పనులు చివరిదశకు చేరుకోవడంతో ఆ మార్గంలో ఫ్రీఎన్ఐ, మెయిన్ ఎన్ఐ పనులు జరుగుతున్న దృష్ట్యా ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేస్తున్నట్లు స్టేషన్ మే నేజర్ పొట్లూరి మోహన్గాంధీ శుక్రవారం తెలిపారు. ఈనెల 13, 14 తేదీల్లో మచిలీపట్నం–బీదర్, బీదర్–మచిలీపట్నం, నర్సాపూర్–ధర్మవరం, ధర్మవరం–నర్సాపూర్, 12, 13 తేదీల్లో కాకినాడ–లింగంపల్లి, లింగంపల్లి–కాకినాడ రైళ్లు రద్దు అవుతాయి. అదే తేదీల్లో సర్కార్ ఎక్స్ప్రెస్ తెనాలి వర కు, నాగర్సోల్ ఎక్స్ప్రెస్, లింగంపల్లి–నర్సాపూర్ ఎక్స్ప్రెస్లు విజయవాడ వరకు నడుస్తాయన్నారు. తిరుపతి–పూరి ఎక్స్ప్రెస్ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, శేషాద్రి ఎక్స్ప్రెస్, ఎల్టీటీ ఎక్స్ప్రెస్లు 13, 14 తేదీల్లో ఏలూరు, నిడదవోలు మీదుగా దారి మళ్లింపు జరుగుతుందని, మచిలీపట్నం–విజయవాడ, నర్సాపూర్–గుంటూరు పాసింజర్ రైళ్లు పూర్తిగా రద్దవుతాయని ఆయన తెలిపారు. -
చెన్నైని కరుణించని వరుణుడు
చెన్నై : వరద బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న చెన్నైని వరుణుడు వదిలిపెట్టేలా కనిపించడం లేదు. బుధవారం తెల్లవారుజాము నుంచి చెన్నైలో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. చాలా రోజుల తర్వాత సూర్యుడు కనిపించాడని సంబరపడిన ప్రజలకు ఆ సంతోషం కొన్ని గంటలు కూడా మిగలలేదు. ఆకాశం మళ్లీ మబ్బులు పట్టి వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో తేలికపాటి స్థాయి నుంచి ఓ మోస్తరు వరకు వర్షం పడింది. మరోవైపు దక్షిణ తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఎనిమిది జిల్లాల్లో కాలేజీలు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు. కాగా దక్షిణ మధ్య రైల్వే కూడా చెన్నై నుంచి దూరప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేసింది. నవజీవన్ ఎక్స్ప్రెస్ సహా ఏడు రైళ్లను రద్దు చేసింది. కాగా చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. -
4,5,6 తేదీల్లో పలు రైళ్లు రద్దు
హైదరాబాద్ : గత నెలలో ఇటార్సీ జంక్షన్లో జరిగిన అగ్ని ప్రమాదం దృష్ట్యా రూట్ రిలే ఇంటర్ లాకింగ్ వ్యవస్థ రద్దయిన నేపథ్యంలో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. ఈ క్రమంలో ఈనెల 4న జైపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-పట్నా, 5న హైదరాబాద్-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్, పట్నా-పూర్ణ ఎక్స్ప్రెస్, 6న సికింద్రాబాద్-పట్నా ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు కానున్నాయి. -
పలు రైళ్లు రద్దు: ఈస్ట్ కోస్ట్ రైల్వే
భారీ వర్షాల కారణంగా విశాఖపట్నం డివిజన్లో పలు రైళ్లు రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే ఆదివారం వెల్లడించింది. విశాఖ, భువనేశ్వర్, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే పలు రైళ్లను దారి మళ్లీస్తున్నట్లు పేర్కొంది. రైలు నెంబర్12863: హౌరా -యశ్వంత్పూర్, రైలు నెంబర్18463: భువనేశ్వర్ - బెంగళూరు మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్ప్రెస్, రైలు నెంబర్18047: హౌరా-వాస్కో అమరావతి ఎక్స్ప్రెస్, రైలు నెంబర్18401: పూరీ-వోకా ఎక్స్ప్రెస్ రైళ్లు.. విజయనగరం, రాయ్పూర్, నాగ్పూర్ మీదుగా మళ్లీస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే పేర్కొంది.