చెన్నైని కరుణించని వరుణుడు
చెన్నై : వరద బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న చెన్నైని వరుణుడు వదిలిపెట్టేలా కనిపించడం లేదు. బుధవారం తెల్లవారుజాము నుంచి చెన్నైలో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. చాలా రోజుల తర్వాత సూర్యుడు కనిపించాడని సంబరపడిన ప్రజలకు ఆ సంతోషం కొన్ని గంటలు కూడా మిగలలేదు. ఆకాశం మళ్లీ మబ్బులు పట్టి వర్షాలు కురుస్తున్నాయి.
చాలా ప్రాంతాల్లో తేలికపాటి స్థాయి నుంచి ఓ మోస్తరు వరకు వర్షం పడింది. మరోవైపు దక్షిణ తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఎనిమిది జిల్లాల్లో కాలేజీలు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు. కాగా దక్షిణ మధ్య రైల్వే కూడా చెన్నై నుంచి దూరప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేసింది. నవజీవన్ ఎక్స్ప్రెస్ సహా ఏడు రైళ్లను రద్దు చేసింది. కాగా చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.