ఎన్నికల ముందు ఎన్నో ప్రకటనలు, ప్రసంగాలు..చివరికి అన్నీ నీటి ముటాలే.. | Punjab Polls: No party Has Given Much prominence To Women In Candidates List | Sakshi
Sakshi News home page

ఎన్నికల ముందు ఎన్నో ప్రకటనలు, ప్రసంగాలు..చివరికి అన్నీ నీటి ముటాలే..

Published Fri, Jan 21 2022 12:05 PM | Last Updated on Fri, Jan 21 2022 2:38 PM

Punjab Polls: No party Has Given Much prominence To Women In Candidates List - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఎన్నికలకు ముందు మహిళా సాధికారతపై రాజకీయ పార్టీలు చేసిన అనేక ప్రకటనలు, ప్రసంగాలు... అభ్యర్థుల జాబితాకు వచ్చేసరికి నీటి మూటలుగా తేలాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీతో పాటు శిరోమణి అకాలీదళ్, ఆమ్‌ ఆద్మీ పార్టీ, సంయుక్త సమాజ్‌ మోర్చాలు ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఏ పార్టీ కూడా మహిళలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రధాన పార్టీలన్నీ 8 నుంచి 10 శాతానికి మించి సీట్ల కేటాయింపు చేయకపోవడం అనేది మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. టికెట్లు కేటాయింపు లేకపోయినా కోటి మంది మహిళల ఓటర్లను ఆకట్టుకొనేందుకు తా యిలాలు ప్రకటనల్లో పోటీ పడుతున్నాయి.  

సీట్ల కేటాయింపులో వెనకబాటు 
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్‌లోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు రాబోయే ఎన్నికల్లో 33 నుంచి 50 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించాయి. అయితే ప్రస్తుతం పంజాబ్‌లో బరిలో ఉన్న నాలుగు పెద్ద రాజకీయ పార్టీలు ఈ నెల 18 వరకు మొత్తం 322 మంది అభ్యర్థులను ప్రకటిం చాయి. కాగా వీరిలో కేవలం 26 మంది మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇది మొత్తం అభ్యర్థులలో కేవలం 8 శాతం మాత్రమే. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి వరకు ప్రకటించిన 86 మంది అభ్యర్థుల్లో కేవలం 9 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. 
చదవండి: పార్టీల అదృష్టా‍న్ని తారుమారు చేయగలరు.. మరి ముస్లిం ఓట్లు కొల్లగొట్టేదెవరు!

అదే సమయంలో అధికారంలోకి వస్తే మహిళల అభివృద్ధికి బాట వేస్తామని ప్రకటించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ సైతం 112 మందిలో 12 మంది, అకాలీదళ్‌ 94 మందిలో 4 మంది, సంయుక్త సమాజ్‌ మోర్చా ప్రకటించిన 30 మంది అభ్యర్థుల్లో కేవలం ఒక మహిళా అభ్యర్థికి మాత్రమే అవకాశం ఇచ్చారు. కాగా భారతీ య జనతా పార్టీ, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు చెందిన పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ కూటమి ఇప్పటివరకు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. 

ప్రియాంక నినాదం గాలి తీశారు..
యూపీలో కాంగ్రెస్‌ తరఫున ఆ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రియాంకా గాంధీ 40 శాతం సీట్లు కేటాయిస్తే.. పంజాబ్‌లో వచ్చేసరికి తొలిజా బితాలోనే ప్రియాంక నినాదం.. ‘ఆడపిల్లను.. రాడగలను’ ప్రియాంక నినాదం గాలి తీసేసిటట్లు చేశారు ఇక్కడి కాంగ్రెస్‌ బాధ్యులు, పార్టీ అధిష్టానం. పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ తాము అధికారంలోకివస్తే మహిళలకు నెలకు రూ.2వేలు, ఏడాదిలో 8 ఎల్‌పీజీ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించినప్పటికీ, తొలి జాబితాలో 9 మంది మహిళలకే సీట్లు ఇచ్చారు. 
చదవండి: UP Assembly Elections 2022: సమోసా-చాయ్‌ నుంచి బీఎండబ్ల్యూ వరకు.. ఇవే ధరలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement