
చండీగఢ్: బాలీవుడ్ లెజండరీ గాయని లతా మంగేష్కర్ మరణించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఈ రోజు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనున్నారు. అయితే లతా మంగేష్కర్ గౌరవార్థం ఎటువంటి సంబరాలు చేసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరింది. ఇక పంజాబ్‌లో జరిగే ప్రచార ర్యాలిలో లత ఆలపించిన ‘ఏ మేరే వతన్ కే లోగోన్’ పాట ప్లే చేయనున్నారు. ఆమె మృతిపట్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియంక వాద్రా ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు.
‘ఆమె అనేక దశాబ్దాలుగా భారతదేశానికి అత్యంత ప్రియమైన గాయనిగా కమనీయమైన పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మంగేష్కర్ బంగారు స్వరం అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తుంటుంది’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ప్రియాంక వాద్రా కూడా భారత మాజీ ప్రధాని ఇందిగాంధీతో దిగిన లతామంగేష్కర్ ఫోటోని షేర్ చేస్తూ.. "ఆమె మరణం భారతీయ కళా ప్రపంచానికి కోలుకోలేని లోటు కలిగించింది. ఆమె కుటుంబ సభ్యులకు ఆ బాధను భరించే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా." అని ట్వీట్ చేశారు.
(చదవండి: ఇరవయ్యోస్సారి!.. తగ్గేదేలే..)
Comments
Please login to add a commentAdd a comment