‘సీఎం కావాలన్నది సిద్ధూ కల’ | Amarinder Singh Says Sidhu Wants To Become Next Punjab CM | Sakshi
Sakshi News home page

‘సీఎం కావాలన్నది సిద్ధూ కల’

Published Sun, May 19 2019 5:03 PM | Last Updated on Sun, May 19 2019 5:04 PM

Amarinder Singh Says Sidhu Wants To Become Next Punjab CM   - Sakshi

చండీగఢ్‌ : మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్ధూ పంజాబ్‌ తదుపరి ముఖ్యమంత్రిగా తన స్దానంలో అధికార పగ్గాలు చేపట్టాలని కోరుకుంటున్నారని ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా తన వ్యాఖ్యలతో సిద్ధూ కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్‌లో సింగ్‌ ఆదివారం తన ఓటు హక్కును వినియోగించుకునే ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, సిద్ధూతో తనకేమీ వివాదం లేదని, ఆయన సీఎం కావాలని కోరుకుంటే ప్రజల ఆకాంక్షలు వారికి ఉంటాయని అన్నారు. సిద్ధూ చిన్నతనం నుంచే తనకు తెలుసని, ఆయనతో అభిప్రాయబేధాలు లేవని చెప్పారు. సీఎం కావాలన్నదే ఆయన వ్యాపకమని విమర్శించారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి కేంద్రంలో యూపీఏ 3 ఏర్పాటవుతుందని సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement