
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతుంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో 15 రోజుల్లో కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, కెప్టెన్ అమరీందర్‌తో ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,రైతు నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కాగా, అమరీందర్ సింగ్ పంజాబ్ వికాస్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.
సన్నిహితులతో, కార్యకర్తలతో చర్చించాక భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని అమరీందర్ సింగ్ సన్నిహితులు తెలిపారు. కాంగ్రెస్,ఆప్, అకాలీదళ్ అసంతృప్త నేతలను అమరీందర్ కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, సిద్ధూ పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రానికి సరైన వ్యక్తి కాదని.. ఆయన ఎన్నికలలో.. ఏ స్థానం నుంచి బరిలోకి దిగిన గెలవనిచ్చేది లేదని అమరీందర్ సింగ్ ఇది వరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
చదవండి: శాంతించిన సిద్ధూ..!