
చండీగఢ్: నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాల్లో ఒక్కసారిగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ ఛన్నీ స్పందించారు. సిద్ధూ రాజీనామాపై తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. నవజ్యోత్ సింగ్‌పై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు.
సిద్ధూ రాజీనామాపై మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. నవజ్యోత్ సింగ్ నిలకడలేని వ్యక్తని.. తాను ఎప్పుడో చెప్పానని ఘాటుగా విమర్శించారు. పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రానికి సిద్ధూ సరైన వ్యక్తి కాదని అన్నారు. అయితే, ప్రస్తుతం పంజాబ్‌లో ఇద్దరు కీలక నేతల రాజీనామాలతో కాంగ్రెస్‌పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
చదవండి: కాంగ్రెస్‌కు మరో షాక్: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా