సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ఎన్నికల ఏడాది కనుకనే ఎలాంటి ఆధారాలు లేకుండా పుల్వామా ఉగ్రదాడి విషయంలో పాక్‌ను నిందిస్తున్నారని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానింంచిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్ వ్యాఖ్యలపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మండిపడ్డారు. జైషే చీఫ్ మసూద్ అజహర్‌ను పెంచిపోషిస్తూ నంగనాచి కబుర్లు చెబుతున్నారంటూ ట్విటర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐఎస్‌ఐ మద్దతుగా ఉగ్ర కార్యకలాపాలు చేస్తున్న మసూద్ బహవల్పూర్‌లోనే ఉన్నాడని అమరీందర్ ఆరోపించారు. మసూద్ అరెస్టు విషయంలో ఇమ్రాన్‌కు చేతకాకపోతే ఏం చేయాలో తమకు తెలుసునని అన్నారు. ఇమ్రాన్ కోసం తామే ఆ పని చేస్తామని హెచ్చరించారు. (పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన పాక్)
ఇదిలాఉండగా.. కశ్మీర్‌లో 40మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను బలితీసుకున్న ‘పుల్వామా ఆత్మాహుతి ఉగ్రదాడి’కి సూత్రధారిగా భావిస్తున్న కమ్రాన్ అలియాస్ అబ్దుల్ ఘాజీ రషీద్‌సహా ముగ్గురు జైషే మహ్మద్ ముష్కరులను భద్రతా దళాలు హతమార్చాయి. సోమవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ మేజర్ సహా ఐదుగురు భద్రతా సిబ్బంది, ఓ పౌరుడు అమరులయ్యారు. పోలీస్ డీఐజీసహా 9 మంది సిబ్బంది గాయపడ్డారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రదేశానికి 12 కి.మీ.ల దూరంలోని పింగ్లాన్‌లో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
Dear @ImranKhanPTI you have Jaish chief Masood Azhar sitting in Bahawalpur & masterminding the attacks with ISI help. Go pick him up from there. If you can’t let us know, we’ll do it for you. BTW what has been done about the proofs of Mumbai’s 26/11 attack. Time to walk the talk. pic.twitter.com/Zct6I7QieY
— Capt.Amarinder Singh (@capt_amarinder) February 19, 2019
Comments
Please login to add a commentAdd a comment