చండీగఢ్: భారత్–చైనా సరిహద్దుల మధ్య వివాదాలు ముదురుతున్న వేళ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ దీనిపై స్పందించారు. ఇది 1962 కాలం కాదని.. చైనా ఇప్పుడు మనల్ని తేలీకగా తీసుకోకూడదని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కేంద్రం చైనాతో సరిహద్దు వివాదాన్ని దౌత్య ప్రయత్నాల ద్వారా పరిష్కరించలేకపోతే.. ఉక్కు పిడికిలితో సమాధానం చెప్పాలి. భారత్, చైనా వంటి సార్వభౌమ దేశాలు సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం కనుగొనాలి. భారతదేశం యుద్ధాన్ని కోరుకోదు. కాని చైనా బెదిరింపులను మేము అంగీకరించము. మాకు శాంతి కావాలి. అలానే చైనీయులు భారత భూభాగం నుంచి వెనక్కు వెళ్లాలి. చైనీయుల దూకుడుకు మనం భయపడకూడదు. వారిని ధైర్యంగా ఎదుర్కొవాలి’ అన్నారు. (బాయ్‌కాట్ చైనా)
అలానే చైనా తాను ఆక్రమించిన భారత భూభాగాన్ని వదిలి వెళ్లాలని.. దానిపై చైనాకు ఎలాంటి హక్కు లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత సాయుధ బలగాలు.. 1962 కంటే బలంగా, మరింత ఆధునికీకరించబడ్డాయని అన్నారు. ఇప్పుడు చైనా భారత్‌ను తేలికగా తీసుకోకూడదని అమరీందర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment