చండీగఢ్: పంజాబ్ అధికార పార్టీలో ఇంకా విబేధాలు సద్దుమణగలేదు. పంజాబ్ పరిణామాలతో కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామాతో ఆ విబేధాలు తారస్థాయికి వెళ్లాయి. పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సిద్ధూ, అమరీందర్ సింగ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో ఉన్నాయి. అయితే తన రాజీనామాకు కారణమైన సిద్ధూను వదిలే ప్రసక్తే లేదని తాజా మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు.
చదవండి: ఈ ద్రాక్ష పండ్ల గుత్తి రూ.లక్షల్లో.. ఒక్క పండు రూ.33 వేలంట..
రాజీనామా అనంతరం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పిన అమరీందర్ సింగ్ అయితే భవిష్యత్‌లో సిద్ధూను మాత్రం ముఖ్యమంత్రిగా కానివ్వను అని స్పష్టం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూను కచ్చితంగా ఓడిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సిద్ధూపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్ధూపై పోటీగా బలమైన అభ్యర్థిని నిలబెడతానని చెప్పారు. సిద్ధూ పంజాబ్‌తో పాటు దేశానికి కూడా ప్రమాదకరమని తెలిపారు. సిద్ధూ సీఎం కాకుండా అడ్డుకునేందుకు ఎలాంటి పని చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. రాహుల్, ప్రియాంకగాంధీ తన పిల్లల్లాంటి వారని పేర్కొన్నారు. ముగింపు ఇలా ఉండాల్సింది కాదని ఈ పరిణామాలతో తాను తీవ్ర మనస్తాపానికి లోనట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment