navjyoti singh sidhu
-
Punjab Election 2022: ‘సీఎం అభ్యర్థి చాయిస్.. చాన్స్ కాదు’
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ స్వరం మారుతోంది. ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న ఆయన ఇన్నాళ్లూ సీఎం అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోనే ఉందని అంటూ వచ్చారు. పార్టీ ఎవరిని ఎంపిక చేసినా కట్టుబడి ఉంటానని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలో సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియను టెలి ఓటింగ్ ద్వారా ప్రారంభించిన కాంగ్రెస్ రేపో మాపో ఒక ప్రకటన చేస్తుందనుకున్న సమయంలో ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఇసుక మాఫియా ఆరోపణలపై సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపేంద్ర సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసిన రోజు సిద్ధూ నేరుగా చన్నీపైనే తన అస్త్రాలను సంధించారు. ఎన్డీటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో సీఎం అభ్యర్థికి నీతినిజాయితీలే ముఖ్యమంటూ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. అధిష్టానం నిర్ణయం ఒక్కటే చాలదని ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉండాలంటూ తాను ఎంతకైనా తెగిస్తానని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ప్రశ్న: కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎలాంటివారై ఉండాలి ? జవాబు: కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిని, క్లీన్ ఇమేజ్ ఉన్నవారిని ఎంపిక చేయాలి. కనీసం 17 ఏళ్ల ట్రాక్ రికార్డు చూడాలి. నైతికత కోల్పోయిన వారిని, అవినీతి, బంధుప్రీతి, మాఫియాతో సంబంధాలున్న వారిని ఎంపిక చేస్తే ప్రజలు మార్పు కోరుకుంటారు. ఎన్నికల్లో పార్టీని నిలువునా పాతిపెడతారు. ప్రశ్న: మీరు సీఎం అభ్యర్థి అయ్యే అవకాశాలు ఏమేరకు ఉన్నాయంటారు? జవాబు: నేనే సీఎం అభ్యర్థినని అనుకోవడం లేదు. అలా చెబితే అది అహంకారమే అవుతుంది. కానీ నేను ఒక్క మాట చెప్పగలను. నవజోత్ సింగ్ సిద్ధూ అంటే అల్లాటప్పా వ్యక్తి కాదు. సెలెబ్రిటీ హోదాలో ఉండి ఆరు ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తుల్ని మీరు ఎంతమందిని చూశారో చెప్పండి. వాస్తవానికి ప్రజలే ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. ప్రజావాణినే ఆ దేవదేవుడి శాసనంగా భావించాలి. ప్రశ్న: కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా మీకు ఆమోదయోగ్యమేనా? జవాబు: నాకు అంగీకారమా కాదా అన్నది విషయం కాదు. ఆ నాయకుడికి ప్రజామోదం లభించాలి. ఎమ్మెల్యేల మద్దతు కూడా కచ్చితంగా ఉండాలి. ఎమ్మెల్యేల మద్దతు లేకుండా ఎవరైనా సీఎం కాగలరా? కనీసం 60 మంది ఎమ్మెల్యేల మద్దతైనా ఉండాలి. ప్రశ్న: ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? జవాబు: ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి నీతి నిజాయితీ కలిగిన వారి నాయకత్వం అత్యంత అవసరం. సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపైనే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. సీఎం అభ్యర్థి ఎప్పుడైనా ఛాయిస్ అవాలి. అంతే తప్ప చాన్స్ తీసుకోకూడదు (విస్తృత ప్రజామోదం ఉన్న నాయకుడు కావాలేగాని... అధిష్టానం ఎంపిక చేసిన ఎవరో ఒకరు కాకూడదు). ఎవరికి పార్టీని గెలిపించే సత్తా ఉందో కాంగ్రెస్ పెద్దలు తెలుసుకోవాలి. మాఫియా దందాలు చేసే వ్యక్తి పార్టీ కార్యక్రమాలను అమలు చేయగలరా? అవినీతిపరుల్ని కాపాడేవారికి పగ్గాలు అప్పగిస్తే, వాళ్లు మాఫియాను ఎలా అంతం చేయగలరు? ప్రశ్న: అమృత్సర్ (తూర్పు) నియోజకవర్గం అభ్యర్థిగా మీ లక్ష్యం ఏమిటి? శిరోమణి అకాలీదళ్ నాయకుడు బిక్రమ్‌సింగ్ మజితాయి ఎంతవరకు పోటీ ఇస్తారు? జవాబు: నేను భావితరం బాగోగుల కోసం పోరాటం చేస్తాను. భావితరం బాగుంటేనే దేశ భవిష్యత్ బాగుంటుంది. ఇప్పుడు జరుగుతున్నది ధర్మపోరాటం.ధర్మం ఎటువైపు ఉంటే విజయం అటువైపే ఉంటుంది. ధర్మయుద్ధంలో అకాలీదళ్ ఎప్పటికీ నెగ్గలేదు. -
‘అతడిని ముఖ్యమంత్రిని కానివ్వను.. ఏమైనా చేస్తా’
చండీగఢ్: పంజాబ్ అధికార పార్టీలో ఇంకా విబేధాలు సద్దుమణగలేదు. పంజాబ్ పరిణామాలతో కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామాతో ఆ విబేధాలు తారస్థాయికి వెళ్లాయి. పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సిద్ధూ, అమరీందర్ సింగ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో ఉన్నాయి. అయితే తన రాజీనామాకు కారణమైన సిద్ధూను వదిలే ప్రసక్తే లేదని తాజా మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. చదవండి: ఈ ద్రాక్ష పండ్ల గుత్తి రూ.లక్షల్లో.. ఒక్క పండు రూ.33 వేలంట.. రాజీనామా అనంతరం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పిన అమరీందర్ సింగ్ అయితే భవిష్యత్‌లో సిద్ధూను మాత్రం ముఖ్యమంత్రిగా కానివ్వను అని స్పష్టం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూను కచ్చితంగా ఓడిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సిద్ధూపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్ధూపై పోటీగా బలమైన అభ్యర్థిని నిలబెడతానని చెప్పారు. సిద్ధూ పంజాబ్‌తో పాటు దేశానికి కూడా ప్రమాదకరమని తెలిపారు. సిద్ధూ సీఎం కాకుండా అడ్డుకునేందుకు ఎలాంటి పని చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. రాహుల్, ప్రియాంకగాంధీ తన పిల్లల్లాంటి వారని పేర్కొన్నారు. ముగింపు ఇలా ఉండాల్సింది కాదని ఈ పరిణామాలతో తాను తీవ్ర మనస్తాపానికి లోనట్లు తెలిపారు. -
లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ నాయకులు వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో అధికారం వచ్చినట్టే వచ్చి చేజారడంతో ఈసారి జరిగే లోక్‌సభ ఎన్నికలకు పక్కా ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్గోయల్తోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీపరంగా పనులను ముమ్మరం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కార్యకర్త సమ్మేళనాలు నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ‘వోట్ ఫర్మోడీ, వోట్ ఫర్ స్ట్రాంగ్ ఇండియా’ నినాదంతో జనంలోకి వెళ్లనున్నట్టు తెలిపారు. ఇప్పటికే పార్టీ తరఫున ఠీఠీఠీ.జీఛీజ్చీ272.ఛిౌఝ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. 0782007820 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వడం ద్వారా మద్దతు తెలపవచ్చన్నారు. మోడీ నేతృత్వంలో గుజరాత్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించే సమాచార కిట్లను నగరవ్యాప్తంగా పంచనున్నట్టు గోయల్ చెప్పారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. మహిళలు, యువత లక్ష్యంగా మహిళా సమ్మేళనాలు, యువ సమ్మేళనాల పేరిట ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. పార్టీ భవిష్యత్ ప్రణాళికలు వెల్లడించేందుకు చింతన్ శిబిర్‌ను జనవరి లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. తాల్కటోరా స్టేడియంలో శనివారం నిర్వహించనున్న ‘అభినందన్ ర్యాలీ’లో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సీనియర్ నాయకులు సుష్మాస్వరాజ్,అరుణ్‌జైట్లీ, ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జీ నితిన్ గడ్కరీ, కో-కన్వీనర్ నవజ్యోతిసింగ్ సిద్ధూ తదితరులు పాల్గొంటారని గోయల్ తెలిపారు.