
న్యూఢిల్లీ: రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లోక్ కాంగ్రెస్(పీఎల్‌సీ)తో కలిసి బరిలోకి దిగనున్నట్లు బీజేపీ ప్రకటించింది. పీఎల్‌సీ చీఫ్, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్‌తో బీజేపీ పంజాబ్ ఇంఛార్జ్ గజేంద్ర షెకావత్ సమావేశం అనంతరం రెండు పార్టీల మధ్య పొత్తును శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఇరుపార్టీల పొత్తుతో రానున్న ఎన్నికల్లో గెలుపు ఖాయమని, సీట్ల పంపకాల వివరాలను సరైన సమయంలో వెల్లడిస్తామని వారు తెలిపారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్‌ను వదిలిన అమరీందర్.. పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఇక శిరోమణి అకాలీదళ్‌తో బీజేపీకి ఉన్న చిరకాల బంధం మూడు వ్యవసాయ చట్టాల సమస్యతో తెగిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో బీజేపీ, పీఎల్సీతో సంప్రదింపులు మొదలుపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment