చండీగఢ్: మహమ్మారి కరోనా వైరస్ మూడో దశ తీవ్రస్థాయిలో దాడి చేస్తుందనే వార్తల నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేగవంతం చేసింది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నారు. 18 ఏళ్లలోపు వయసు వారందరూ వేసుకోవాలని చెబుతున్నా కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క వ్యాక్సిన్ డోస్ కూడా వేసుకోని వారు ఇంకా కోట్లలోనే ఉన్నారు. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండడంపై పంజాబ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
వారి విషయంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులు సెలవుపై వెళ్లాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీ తర్వాత ఒక్క వ్యాక్సిన్ డోస్ కూడా వేసుకోని ఉద్యోగులు ఉంటే వారు సెలవుపై వెళ్లాలని స్పష్టం చేశారు. వారు వ్యాక్సిన్ వేసుకునే దాక సెలవుపై ఉండాల్సిందే. వ్యాక్సిన్ వేసుకునే కార్యాలయంలోకి అడుగుపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ ఆదేశాలు జారీ చేశారు. కరోనాపై శుక్రవారం నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు సీఎం అమరీందర్ తెలిపారు. వ్యాక్సిన్ ఉద్యోగులందరికీ చేరాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వ్యాక్సినేషన్ పూర్తికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment