హీరోయిన్కు, ఆమె సోదరికి సమన్లు | Hrithik Roshan names Kangana Ranaut in FIR | Sakshi
Sakshi News home page

హీరోయిన్కు, ఆమె సోదరికి సమన్లు

Published Thu, Mar 31 2016 7:10 PM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

హీరోయిన్కు, ఆమె సోదరికి సమన్లు

హీరోయిన్కు, ఆమె సోదరికి సమన్లు

ముంబై: బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్ లవ్ స్టోరీ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రేమకు కటీఫ్ చెప్పాక ఇద్దరూ ఈ మెయిల్స్ విషయంపై పరస్పరం లీగల్ నోటీసులు ఇవ్వగా, తాజాగా హృతిక్ ఎఫ్ఐఆర్లో తొలిసారి కంగనా పేరును చేర్చాడు. హృతిక్ ఫిర్యాదు మేరకు విచారణకు రావాల్సిందిగా ముంబై సైబర్ సెల్ పోలీసులు కంగనాకు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో కంగనా సోదరి రంగోలీని సాక్షిగా చేర్చడంతో ఆమెను కూడా విచారణకు పిలిచారు.

ముంబైలోని బంద్రా-కుర్లా కాంప్లెక్స్లోని సైబర్ సెల్ పోలీస్ స్టేషన్కు వారం రోజుల లోపు విచారణకు హాజరు కావాలని కంగనా సిస్టర్స్ను పోలీసులు ఆదేశించారు. హృతిక్, కంగనా ప్రేమలో ఉన్నప్పుడు ఈమెయిల్స్ పంపుకున్నారు. ప్రేమ విఫలమయ్యాక పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. 2014 డిసెంబర్లో ఫిర్యాదు చేసినపుడు హృతిక్.. కంగనా పేరును పేర్కొనలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement