
కేజ్రీవాల్‌కు బీజేపీ లీగల్ నోటీసు జారీ
సాక్షి, న్యూఢిల్లీ: ఓటరు జాబితాలో నకిలీ ఓటర్లను చేర్పించి బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు బీజీపీ లీగల్ నోటీసు జారీ చేసింది. తమపై అసత్యపు ఆరోపణలు చేసినందుకు కేజ్రీవాల్‌కు నోటీసు జారీ చేసిట్లు బీజేపీ ఢిల్లీ శాఖఅధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ చెప్పారు. కేజ్రీవాల్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేసిన ఆయన ఎలాంటి రుజువులు సమర్పించలేదని చెప్పారు. ‘ప్రతి నియోజకవర్గంలో ఓటరు జాబితాలో కనీసం 5,000 వేల మంది నకిలీ ఓటర్లను చేర్పించడంతోపాటు, ఆప్ ఓటర్లను తొలగించేలా చూడాలని బీజేపీ అగ్ర నేత ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారని కేజ్రీవాల్ శనివారం ట్వీట్ చేశారు. ఇందుకు బీజేపీ రేట్లు కూడా నిర్ణయించిందని, ఈ పని చేసిన వ్యక్తి తనకు ఈ విషయం చెప్పాడు’ అని కేజ్రీవాల్ ఆరోపించారు.