Tamannaah Bhatia Legal Action Against Master Chef Makers - Sakshi
Sakshi News home page

Master chef: అనసూయ ఎంట్రీ.. షో నిర్వాహకులకి షాకిచ్చిన తమన్నా!

Published Sun, Oct 24 2021 1:59 PM | Last Updated on Fri, Dec 17 2021 9:54 PM

Tamannaah Bhatia Legal Action Against MasterChef Makers - Sakshi

టాలీవుడ్‌ పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన నటన, గ్లామర్‌తో ఆకట్టుకుని ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇటీవల వెబ్ సిరీస్‌లోనూ అడుగుపెట్టి తన హవాని అక్కడ కూడా కొనసాగిస్తోంది ఈ అమ్మడు. తాజాగా టెలివిజన్‌లో ‘మాస్టర్‌ చెఫ్‌ తెలుగు’ షోతో ప్రేక్షకుల మందుకు తమన్నా వచ్చింది. అయితే పలు కారణాల వల్ల ఈ షో నుంచి ఆమెను తప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రోగ్రాం విషయంలో తమన్నా కోర్టను ఆశ్రయించి ప్రొడక్షన్‌ హౌజ్‌కి షాకిచ్చిందట.

వివరాల్లోకి వెళితే.. తమన్నా హోస్ట్‌గా టీవీలో ‘మాస్టర్ చెఫ్ తెలుగు’ కార్యక్రమం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ షో రేటింగ్స్ విషయానికి వస్తే.. మొదట్లో బాగానే వచ్చినా, ఇటీవల మాత్రం ఆశించినంతగా రేటింగ్ లేకపోవడంతో తమన్నాను తప్పించి టాప్‌ యాంకర్‌ అనసూయను తెరపైకి తీసుకొచ్చింది ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ.

అనసూయ ఎంట్రీతో ఈ షోకి మళ్లీ మంచి రేటింగ్ సాధిస్తుందని ప్రొడక్షన్ హౌస్ నిర్వాహకులు ఆశాభావంతో ఉన్నారు. ఇదిలా ఉండగా తనను తొలగించడంపై అసంతృప్తితో ఉన్న మిల్కీ బ్యూటీ.. ఆమెకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రొడక్షన్‌ హౌజ్‌కు లీగల్‌ నోటీసులు పంపించింది. ఈ అంశంపై తమన్నా తరపు లాయర్‌ మాట్లాడుతూ.. మాస్టర్ చెఫ్ కార్యక్రమం కోసం తమన్నా పలు ప్రాజెక్టులు వదులుకొన్నారు.

ఈ షోకు సంబంధించిన తొలి సీజన్‌ను పూర్తి చేయడానికి కొన్ని ముఖ్యమైన పనులను కూడా ఆమె రద్దు చేసుకోవాల్సి వచ్చింది. తన క్లయింట్‌తో షో నిర్వాహకులు అన్ ప్రొఫెషనల్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా తన క్లయింటతో ప్రొడక్షన్ హౌస్ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కమ్యునికేషన్ కూడా ఆపివేశారని వెల్లడించారు.

చదవండి: తమన్నా ప్లేస్‌లో అనసూయ, బ్లాక్‌ సూట్‌, హాట్‌ లుక్స్‌తో అదుర్స్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement