Tamannaah Sends Legal Notice To Masterchef Production House - Sakshi
Sakshi News home page

Tamannah Bhatia: మాస్టర్‌ చెఫ్‌ నిర్వాహకులకు తమన్నా లీగల్‌ నోటీసులు

Published Wed, Oct 27 2021 12:26 PM | Last Updated on Thu, Oct 28 2021 3:18 PM

Tamannaah Sends Legal Notice To Masterchef Production House - Sakshi

Reason Behind Tamannah Bhatia Replacement In Masterchef Show: మిల్కీ బ్యూటీ తమన్నా హోస్ట్‌గా ప్రారంభమై ‘మాస్టర్‌ చెఫ్‌’షో నుంచి ఆమెను తొలగించిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలోకి ప్రముఖ యాంకర్‌ అనసూయను తీసుకున్నారు నిర్వాహకులు. దీంతో ఈ షో ప్రొడక్షన్‌ హౌజ్‌కు తమన్నా లీగల్‌ నోటీసులు పంపించింది. తమన్నా లీగల్‌ యాక్షన్‌పై షో నిర్వాహకులు తాజాగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమన్నా వల్ల దాదాపు 5 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని నిర్వాకులు అంటున్నారు. మొత్తం 18 ఎపిసోడ్‌లకు గాను తమన్నాతో రూ. 2 కోట్ల పారితోషికంతో ఆగ్రిమెంట్‌ కుదుర్చుకున్నారట.

చదవండి: మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని కంగారు పడకండి: సామ్‌ ఆసక్తికర పోస్ట్‌

అయితే ఇతర కమిట్‌మెంట్స్‌ కారణంగా తమన్నా కేవలం 16 రోజుల షూటింగ్‌కు మాత్రమే వచ్చిందని, మిగతా రెండు రోజులు రాలేదని షో నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఆ రెండు రోజులు రాకపోవడంతో 300 మంది టెక్నిషియన్లు పనిచేస్తున్న తమ షోకు రూ. 5 కోట్లు నష్టం వచ్చిందని చెబుతున్నారు. అప్పటికే తమన్నాకు కోటిన్నర రూపాయలు ఇచ్చామని, మిగతా రోజుల షూటింగ్‌ కూడా పూర్తి చేసుంటే మొత్తం డబ్బులు చెల్లించేవారమని వారు పేర్కొన్నట్లు సమాచారం. అంతేగాక అగ్రిమెంట్ ప్రకారం షూటింగ్ పూర్తి చేయకుండా... సెకండ్ సీజన్ అడ్వాన్స్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అసలు సెకండ్ సీజన్‌కు ఆమెను తీసుకోవాలని తాము అనుకోలేదని నిర్వాహకులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

చదవండి: ఆ ఫోటో చూసి సెట్స్‌లో నాతో విచిత్రంగా ప్రవర్తించారు: హీరోయిన్‌

తమన్నా హోస్ట్‌గా మాస్టర్‌ చెఫ్ షో ప్రారంభమైంది. అయితే వివిధ కారణాల వల్ల సడెన్‌గా ఆమె స్థానంలోకి ప్రముఖ యాంకర్‌ అనసూయని తీసుకొచ్చారు షో నిర్వహకులు. దీంతో ఈ విషయం కాస్తా చర్చనీయాంశం అయ్యింది. తన స్థానంలోకి అనసూయను తీసుకోవడమే కాకుండా, తనకు ఇస్తానన్న రెమ్యునరేషన్‌ కూడా షో నిర్వాహకులు ఇ‍వ్వలేదంటు తమన్నా మాస్టర్‌ చెఫ్‌ నిర్వాహకులపై లీగల్‌ యాక్షన్‌కు దిగినట్లు తెలుస్తోంది. కాగా ఆగస్టు 27న ప్రారంభమైన మాస్టర్‌ చెఫ్‌ తొలి మూడు షోలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ తర్వాత క్రమంగా ఈ షో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

చదవండి: Master chef: అనసూయ ఎంట్రీ.. షో నిర్వాహకులకి షాకిచ్చిన తమన్నా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement